రోజుకు 10వేల కేసులు.. మరోసారి లాక్‌డౌన్ అంటూ పుకార్లు, కేంద్రం స్పందన ఇదీ..!!

By Siva Kodati  |  First Published Jun 11, 2020, 5:54 PM IST

కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్ 15 నుంచి దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రారంభం కానుందని దీని సారాంశం


దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడంతో పాటు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇస్తోంది.

దీని కారణంగానే భారతదేశంలో కోవిడ్ 19 కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ప్రతిరోజు తొమ్మిది, పది వేల వరకు కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది.

Latest Videos

undefined

Also Read:గుడ్‌న్యూస్‌: 'చివరి దశ ప్రయోగాలు, సెప్టెంబర్లో కరోనా వ్యాక్సిన్'

కేసుల స్పీడు చూస్తుంటే నాలుగవ స్థానంలో ఉన్న యూకేను అధిగమించేట్లు కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జూన్ 15 నుంచి దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రారంభం కానుందని దీని సారాంశం. అయితే ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ... ఇదో తప్పుడు కథనంగా కొట్టిపారేసింది.

సంపూర్ణ లాక్‌డౌన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో భారతదేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది.

Also Read:ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు: మొత్తం కరోనా కేసులు 2,86,579కి చేరిక

వైరస్‌ను ధీటుగా నియంత్రించగలిగామని వెల్లడించింది. ప్రపంచంలోనే ప్రతి లక్ష జనాభాలో వైరస్ కేసుల సంఖ్య , మరణాల రేటు భారత్‌లో అతి తక్కువగా ఉందని తెలిపింది.

భారతదేశంలో మరణాల రేటు కేవలం 2.8 శాతమే  ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యల్పమని ఐసీఎంఆర్ పేర్కొంది. గురువారం ఒక్కరోజే 357 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 8000 దాటింది. 

click me!