శబరిమల ఆలయాన్ని తెరిచినా కూడ భక్తులకు ఆలయంలో ప్రవేశం లేదని మంత్రి కడంపల్లి సురేంద్రన్ ప్రకటించారు.
తిరువనంతపురం: శబరిమల ఆలయాన్ని తెరిచినా కూడ భక్తులకు ఆలయంలో ప్రవేశం లేదని మంత్రి కడంపల్లి సురేంద్రన్ ప్రకటించారు.
అంతేకాదు ప్రతి ఏటా నిర్వహించే వార్షిక ఉత్సవాలు కూడ నిర్వహించవద్దని నిర్ణయం తీసుకొందని ఆయన తెలిపారు.ఆలయంలో సాధారణ పూజలు మాత్రమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గతంలో నిర్వహించిన సమావేశంలో వార్షిక ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు ఈ ఉత్సవాలకు భక్తులకు కొన్ని ఆంక్షలతో అనుమతి ఇవ్వాలని భావించారు.
వార్షిక ఉత్సవాలను నిర్వహించవద్దని కూడ నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి సురేంద్రన్ తెలిపారు. వచ్చే మాసంలో ఆలయాన్ని తెరిచినా కూడ భక్తులకు మాత్రం ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు.ట్రావెన్ కోరు బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు తీసుకొన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతూ తాంత్రుల్లో ఒకరైన మహేష్ మోహనరాజు బోర్డుకు లేఖ రాశారు.
దీంతో ట్రావెన్ కోరు బోర్డు ఛైర్మెన్ ఎన్. వాసు, తాంత్రి మహేష్ మోహన్ రాజులతో మంత్రి సురేంద్రన్ ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకొన్నారు.
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో ప్రార్ధనా మందిరాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.వార్షిక పూజలతో పాటు ఆలయ ఉత్సవాలను కూడ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.
ఈ నెల 14వ తేదీ నుండి శబరిమలలో భక్తులను అనుమతి ఇస్తామని ట్రావెన్ కోర్ బోర్డు గతంలో ప్రకటించింది. ఆలయ ఉత్సవాలను కూడ నిర్వహిస్తామని కూడ ప్రకటించింది. అయితే తాజాగా తీసుకొన్న నిర్ణయంతో భక్తులకు అనుమతి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.