ఒక్క రోజులోనే 22,252 కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 7,19,665కి చేరిక

By narsimha lode  |  First Published Jul 7, 2020, 10:48 AM IST

 దేశంలో కరోనా కేసుల సంఖ్య  మంగళవారం నాటికి  7,19,665కి చేరుకొన్నాయి.ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. కరోనా సోకిన వారిలో ఇప్పటి వరకు 4,39,947 మంది కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ,ప్రకటించింది.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య  మంగళవారం నాటికి  7,19,665కి చేరుకొన్నాయి.ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. కరోనా సోకిన వారిలో ఇప్పటి వరకు 4,39,947 మంది కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ,ప్రకటించింది.

గత 24 గంటల్లో దేశంలో కరోనాతో 467 మంది మరణించారు. దీంతో ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య 20,160 మంది మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గత 24 గంటల్లో దేశంలో 22,252 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

Latest Videos

also read:గుడ్‌న్యూస్: మార్కెట్లోకి జూలైలోనే కరోనా మందు 'డెస్రెం'

మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.ఈ రాష్ట్రంలో 2,06,619 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,822 మంది మరణించారు. తమిళనాడు రాష్ట్రంలో 24 గంటల్లో 61 మంది మరణించారు. కొత్తగా 3,827 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,14,978కి చేరుకొన్నాయి.

ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటాయి. 24 గంటల్లో కరోనా కేసులు 1,379 నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,00,823కి చేరుకొన్నాయి. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో 72,088 మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 25,620 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.జూలై 5వ తేదీ  వరకు దేశంలో 99,69,662 మంది శాంపిల్స్ సేకరించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. 

గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో కరోనాతో 30 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 401కి చేరుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు 25,317కి చేరుకొన్నాయి. ఇప్పటివరకు 10,527 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా కేంద్రం వెల్లడించింది.

బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 861 కొత్త కేసులు నమోదయ్యాయి.  మరో 22 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 779కి చేరుకొంది. 

ముంబైలో 1,201 కొత్త కేసులు ఒక్క రోజులోనే నమోదయ్యాయి. అంతేకాదు 39 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలోనే 85,326 కరోనా కేసులు రికార్డయ్యాయి. మరో వైపు కరోనాతో ముంబైలో ఇప్పటివరకు 4935 మంది మరణించారు.

click me!