కరోనా వేళ ప్రజలకు యోగా శక్తినిచ్చింది: నరేంద్ర మోడీ

By telugu teamFirst Published Jun 21, 2021, 7:31 AM IST
Highlights

యోగా ఏడో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసగించారు. కరోనా వేళ ప్రజలకు యోగా ఆశాకిరణంలా కనపించిందని ఆయన చెప్పారు.యోగా శక్తిని ఇస్తుందని చెప్పారు.

న్యూఢిల్లీ: కరోనా వేళ ప్రజలకు యోగా ఆశాకిరణంలా కనిపించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలు ఉత్సాహంగా యోగాలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనాతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నామని, ఈ విపత్కర పరిస్థితిలో యోగా ఆశాకిరణంలా కనిపించందని, యోగా కరోనాపై పోరాటానికి శక్తిని ఇస్తుందని ఆయన చెప్పారు. 

చాలా పాఠశాలలు ఆన్ లైన్ లో యోగా తరగతులను నిర్వహించాయని ఆయన చెప్పారు. యోగా నెగెటివిటీ నుంచి క్రియోటివిటీని పుట్టిస్తుందని ఆయన చెప్పారు. కరోనాపై పోరాటం చేయగలమనే శక్తిని యోగా ఇచ్చిందని మోడీ చెప్పారు. 7వ యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 

కోవిడ్ ప్రారంభమైనప్పుడు ఏ దేశం కూడా సంసిద్ధంగా లేదని, ఈ సమయంలో యోగా ఆశాకిరణంలా కనిపించిందని ఆయన చెప్పారు. యోగా వ్యక్తిలో క్రమశిక్షణను పెంచుతుందని ఆయన చెప్పారు. కరోనాపై పోరాడగలమైన విశ్వాసాన్ని ఇస్తుందని ఆయన చెప్ాపరు. 

కరోనాపై పోరాటానికి తాము యోగాను అస్త్రంగా వాడుకున్నామని ఫ్రంట్ లైన్ వారియర్స్ తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో పలు అధ్యయనాలు జరుగుతున్నాయని, యోగా మన దేహంపై, రోగ నిరోధక శక్తిపై ఎలా పనిచేస్తుందనే పరిశోధన జరుగుతోందని ఆయన చెప్పారు. 

click me!