
చెన్నైలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసే మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుపోరూరు నుంచి మాంబాక్కం వెళ్లే మార్గంలో కాయార్ అటవీ ప్రాంతంలో ఈ నెల 17న ఓ మహిళ హత్యకు గురైంది.
మహాబలిపురం డీఎస్పీ గుణశేఖరన్ విచారణ జరిపారు. ఆమె ఆమె చెన్నైలోని ప్రముఖ వస్త్ర దుకాణం లో పనిచేస్తున్న కోవిలంబాక్కం కు చెందిన చంద్రగా గుర్తించారు. ఆమెను హతమార్చిన నన్మంగళంకు చెందిన పెయింటర్ దినేష్ బాబును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
దినేష్ బాబు దగ్గర హతురాలు చంద్ర భర్త మణికంఠ పెయింటర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో చంద్రతో దినేష్ బాబుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మణికంఠన్‌ను విడిచి తనతో వచ్చేయమని దినేష్ బాబు ఆమెను అడిగాడు.
అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఈ నెల 17న తిరుపోరూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు పోలీసులు దినేష్ దినేష్ బాబు చెంగల్పట్టు కోర్టులో హాజరు పరచి పుళల్ జైలులో నిర్బంధించారు.