ఆ కారు కేసును వదిలేయండి: వికోర్లి పోలీసులకు సచిన్ వాజే ఫోన్

By narsimha lodeFirst Published Mar 24, 2021, 4:05 PM IST
Highlights

ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో ఉన్న స్కార్పియో కేసు విచారణను నిలిపివేయాలని సచిన్ వాజే వికోర్లి పోలీసులను కోరినట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

ముంబై: ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో ఉన్న స్కార్పియో కేసు విచారణను నిలిపివేయాలని సచిన్ వాజే వికోర్లి పోలీసులను కోరినట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

ముఖేష్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియోలో పేలుడు పదార్ధాలు ఉన్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈ వాహనం పోయిందని మన్‌సుక్ హిరేన్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన వికోర్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే కారు ఫిబ్రవరి 25వ తేదీన అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో ప్రత్యక్షమైంది.ఈ కేసును సచిన్ వాజే నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది.

ఫిబ్రవరి 27వ తేదీన సచిన్ వాజే వికోర్లి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి స్కార్పియో పోయిందని హిరెన్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తును నిలిపివేయాలని కోరారు.

ఈ కేసు దర్యాప్తు నిలిపివేస్తే ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఉన్న స్కార్పియోలో పేలుడు పదార్ధాలు ఉన్న వాహనం విషయంలో తన పాత్ర బయటపడదని భావించి ఉంటారని ఎన్ఐఏ అనుమానిస్తోంది.

తప్పుడు పేరు, ఆధార్ కార్డులతో ముంబైలోని ట్రైడెంట్ ఫైవ్ స్టార్ హోటల్ లో వాజే బస చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. 
ఈ హోటల్ లో 100 రోజులపాటు ఉండేందుకు రూమ్ అద్దెకు తీసుకొన్నాడు. 

సచిన్ వాజే ఈ హోటల్ లో ఉన్న సమయంలో పెద్ద పెద్ద బ్యాగులను తీసుకొచ్చినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.ఈ బ్యాగుల్లో ఏముందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.సచిన్ వాజేతో వ్యాపార భాగస్వామిగా ఉన్న కార్ల డీలర్ ను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 

click me!