ఎఫైర్ : ప్రియురాలిమీద పెట్రోల్ పోసి నిప్పంటించి.. గట్టిగా వాటేసుకుని...

Published : Apr 12, 2021, 03:47 PM IST
ఎఫైర్ : ప్రియురాలిమీద పెట్రోల్ పోసి నిప్పంటించి.. గట్టిగా వాటేసుకుని...

సారాంశం

వివాహేతర సంబంధాలు రోజురోజుకూ హింసాత్మకంగా ముగుస్తున్నాయి. ఈ సంబంధాల కారణంతో భర్తను లేదా భార్యను, పిల్లల్ని చంపుకోవడం ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికే అతి కిరాతకంగా హతమార్చడం గగుర్పాటు కలిగిస్తోంది. అలాంటి  ఓ సంఘటనే తమిళనాడులో జరిగింది. 

తమిళనాడులోని, చెన్నై కోయంబేడు బస్టాండ్ లో శుక్రవారం రాత్రి మహిళ సజీవ  సజీవదహనం కలకలం రేపింది. ఈ మంటల్లో కాలి ఆమె ప్రియుడు కూడా మృతి చెందాడు.  మృతురాలు శాంతి  కోయంబేడు బస్టాండ్ లోనే ఉంటోంది. ఆమె ఇక్కడ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది.

ఈ నేపథ్యంలో శాంతికి కోయంబేడు మార్కెట్లో ఉన్న కూలి ముత్తుతో  వివాహేతరసంబంధం ఏర్పడింది.  శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నాలుగో ప్లాట్ ఫాం మీద శాంతి పడుకుంది. ఆ సమయంలో పెట్రోలు క్యాన్‌తో వచ్చిన ముత్తు ఆమె పక్కనే పడుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై పెట్రోలు కుమ్మరించి నిప్పంటించాడు.

మంటలకు మేల్కొన్న శాంతి పరుగులు తీయకుండా  గట్టిగా పట్టుకున్నాడు. వీరి కేకలు విని అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరూ మంటల్లో కాలిపోతున్నారు. వెంటనే గాయపడ్డ వారిని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  శనివారం ఉదయం ఇద్దరూ మృతి చెందారు. కాగా ముత్తు సదరు మహిళపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడానికి గల కారణాలు తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..