కరోనా విలయతాండవం... రెండో స్థానంలో భారత్

By telugu news teamFirst Published Apr 12, 2021, 12:35 PM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే.. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది. గత 24గంటల్లో 1,68,912 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఊహించని రేంజ్ లో కరోనా తిరగపెట్టింది. ప్రతిరోజూ కనీసంలో తక్కువలో తక్కువ లక్ష కరోనా కేసులు నమోదౌతున్నాయి. వరసగా ఆరో రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 

ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే.. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది. గత 24గంటల్లో 1,68,912 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తంగా 1.35కోట్ల మంది తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా భారత్ ఈ కరోనా కేసుల విషయంలో రెండో స్థానంలో ఉంది. భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి, కరోనావైరస్ నవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. రాయిటర్స్  ప్రకారం బ్రెజిల్ 1.34 కోట్ల కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 1.35 కోట్లకు చేరుకుంది. 3.12 కోట్ల కేసులతో ప్రపంచ స్థాయికి అమెరికా ముందుంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రక​టించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం విస్తరణ తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే మరో 904 మంది కోవిడ్‌ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో  మొత్తం కేసుల సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కోవిడ్‌ ఉధృతి బాగా కనిపిస్తోంది.  మహారాష్ట్రలో కేసులు  37 శాతం పెరిగి 63,294 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత 24 గంటల్లో 349 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 15,276, ఢిల్లీలో 10,774 కేసులు నమోదయ్యాయి. 

click me!