స్పుత్నిక్ కు ఇండియాలో అనుమతి: తీరనున్న వ్యాక్సిన్ కొరత

Published : Apr 12, 2021, 03:40 PM ISTUpdated : Apr 12, 2021, 03:50 PM IST
స్పుత్నిక్ కు ఇండియాలో అనుమతి: తీరనున్న వ్యాక్సిన్ కొరత

సారాంశం

భారత్ లో మూడో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు కేంద్రం సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.

న్యూఢిల్లీ: భారత్ లో మూడో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు కేంద్రం సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను దేశంలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ సంస్థ తయారు చేస్తోంది. దేశంలో ఈ వ్యాక్సిన్  అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆ సంస్థ డీసీజీఐను కోరింది. 

నిపుణుల బృందం ఈ విషయమై సోమవారం నాడు సమావేశమైంది. డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ ధరఖాస్తుకు ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు  అనుమతి ఇచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్ల తర్వాత స్పుత్నిక్ కు కేంద్రం ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

హైద్రాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ సంస్థ ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. దేశంలో ఈ వ్యాక్సిన్ వినియోగం కోసం డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ డీసీజీఐకి గత వారం క్రితం ధరఖాస్తు చేసుకొంది.స్పుత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ -3 లో 91.6 శాతం ఫలితాలు వచ్చాయని ఆ సంస్థ ప్రకటించింది.. యూఏఈ, భారత్, వెనిజులా, బెలారస్ లలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ ను 200 మిలియన్ మోతాదుల వరకు ఉత్పత్తి చేయడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో విర్చో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకొంది.ఈ వ్యాక్సిన్ ను 2 డిగ్రీల నుడి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసుకొనే వెసులుబాటు ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu