11 రాష్ట్రాలు.. 100 ప్రాంతాలు: ఒకే రోజు సీబీఐ సోదాలు, బడా బాబుల్లో కలవరం

By Siva KodatiFirst Published Mar 27, 2021, 2:53 PM IST
Highlights

గురువారం దేశవ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. వివిధ బ్యాంకులను రూ.3,700 కోట్లకు పైగా మోసం చేసిన నిందితుల నివాసాలు, కార్యాలయాలే టార్గెట్‌గా సీబీఐ దాడులు నిర్వహించింది.

శనివారం దేశవ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. వివిధ బ్యాంకులను రూ.3,700 కోట్లకు పైగా మోసం చేసిన నిందితుల నివాసాలు, కార్యాలయాలే టార్గెట్‌గా సీబీఐ దాడులు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపింది. ఇందుకు సంబంధించి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి

ఇందులో గుంటూరు, హైదారాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలతో పాటు కాన్పూర్‌, ఢిల్లీ, ఘజియాబాద్‌, మథుర, నోయిడా, గురుగ్రాం, చెన్నై, వెల్లూర్‌, తిరుప్పుర్‌, బెంగళూరు, బళ్లారి, వడోదర, కోల్‌కతా, సూరత్‌, ముంబయి, భోపాల్‌, నిమాడి, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, జైపుర్‌, శ్రీగంగానగర్‌లు ఉన్నాయి.  

దాడుల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

click me!