అత్తింటి దుర్మార్గం: మంచానికి కట్టేసి.. నిప్పు, చావు బతుకుల్లో కోడలు

By Siva KodatiFirst Published Feb 5, 2020, 4:32 PM IST
Highlights

వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు చివరికి మంచానికి కట్టేసి నిప్పంటించారు. 

వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు చివరికి మంచానికి కట్టేసి నిప్పంటించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఒడిషాలోని కేంద్రాపడా జిల్లా బొరొడియా గ్రామానికి చెందిన 23 ఏళ్ల  రస్మిత సాహును ఆమె అత్తింటి వారు మంచానికి కట్టి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో దాదాపు 60 శాతం కాలిపోయింది.

ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన విక్రమ్ దాస్‌తో రస్మిత సాహుకు 2018 జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా రస్మిత తల్లిదండ్రులు భారీగా కట్న కానుకలు సమర్పించారు.

Also Read:నిర్భయ కేసు: కేంద్రానికి హైకోర్టు షాక్, దోషులకు వారం గడువు

వాటితో సంతృప్తి చెందిన అత్తింటి వారు రస్మితను తరచూ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసేవారు. వారి వేధింపులకు శారీరకంగా, మానసికంగా కృంగిపోయిన రస్మిత తల్లిదండ్రుల వద్ద బోరుమంది.

దీంతో పుట్టింటి వారు గతేడాది స్థానిక రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్దల ఎదుట రాజీకి వచ్చిన అత్తింటి వారు రస్మితను బాగా చూసుకుంటామని నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు.

Also Read:విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించిన టీచర్... పేరెంట్స్ కి తెలియడంతో..

అయితే కొద్దిరోజులు తర్వాత తిరిగి కోడలిని వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రస్మితను ఆమె అత్త, మామ, ఆడపడుచు మంచానికి కట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారని బాధితురాలి తండ్రి బ్రహ్మానంద సాహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై ఐపీసీ 498-ఎ, 323, 307, 34, 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

click me!