నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేసే విషయంపై ఢిల్లీ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. న్యాయపరమైన అవకాశాలను వారంలోగా వాడుకోవాలని దోషులను ఆదేశించింది. నలుగురిని ఒకేసారి ఉరితీయాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరితీతపై ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి షాక్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దోషుల ఉరితీతపై విధించిన స్టేను ఎత్తేస్తూ దోషులను విడివిడిగా ఉరి తీయడానికి అనుమంతించాలనే కేంద్రం అనుమతిని తిరస్కరించింది.
దోషులను విడివిడిగా ఉరి తీయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. నులుగురిని కూడా ఒకేసారి ఉరితీయాలని స్పష్టం చేసింది. ఉరిశిక్ష అమలుపై జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు దోషులకు వారం రోజుల గడువు విధించింది. వారంలోగా న్యాయపరమైన అవకాశాలను పూర్తి చేసుకోవాలని ఆదేశించింది.
undefined
Also Read: నిర్భయ దోషుల ఉరిపై స్టే ఎత్తివేత పిటిషన్: తీర్పు రిజర్వ్
అధికారుల నిర్లక్ష్యం వల్లనే రకరకాల పిటిషన్లు తెరపైకి వచ్చాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిర్భయ దోషుల ఉరితీతపై ట్రయల్ కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టేను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దోషులను విడివిడిగా ఉరితీయడానికి అనుమతించాలని కూడా కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
ఫిబ్రవరి 1వ తేదీన ఉరి శిక్షను అమలు చేయాలనే డెత్ వారంట్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ముగ్గురు దోషులు అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు ట్రయల్ కోర్టు అనుమతించింది.
Also Read: నిర్భయ కేసు దోషుల ఉరితీతపై స్టే: హైకోర్టులో సవాల్ చేసిన కేంద్రం
2012 డిసెంబర్ 16వ తేదీన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని రేప్ చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురికి ఉరిశిక్ష పడింది. ఈ కేసులో ఓ దోషి మైనర్ కావడంతో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మరో దోషి జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.