మందుబాబులకు షాక్: మద్యంపై 70 శాతం కరోనా పన్ను, భారీగా పెరిగిన రేట్లు!

By Sree s  |  First Published May 5, 2020, 3:19 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో మందుబాబులకు సర్కార్ భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ ఫీజు పేరుతో అదనంగా 70 శాతం పన్ను విధించనుంది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్!


కరోనా వైరస్ లాక్ డౌన్ మూడవదఫాలో కేంద్రం మద్యం షాపులకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే! తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో నిన్న సోమవారం రోజున మద్యం షాపులు తెరుచుకున్నాయి. 

మద్యం షాపులు తెరుచుకుంటున్నాయన్న వార్త తెలియగానే మందుబాబులు ఉదయం నుంచే షాపుల వద్ద బార్లు తీరారు. సోషల్ డిస్టెంసింగ్ అన్న పదమే తామెప్పుడూ వినలేదు అన్నట్టుగా ఒకరిమీద ఒకరు పడుతూ.. సినిమా టిక్కెట్ల కోసం ఎగబడ్డట్టుగా మద్యం కోసం ఎగబడ్డారు. అధికారులు అంత కష్టపడి గీసిన గుండ్రాలాన్ని వ్యర్థమయిపోయాయి. 

Latest Videos

ఇక ఇలా ప్రజలు ఎగబడడంతో చాలా చోట్ల కొద్దిసేపు పాటు మందుబాబులను కట్టడి చేయడానికి మద్యం షాపులను మూసివేశారు కూడా. ఇక ఈ మందుబాబుల గొడవ పక్కనపెడితే... లాక్ డౌన్ వల్ల అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. 

ఇలా కలిగిన నష్టాలను పూడ్చుకోవడానికి ఇప్పుడు ఈ మద్యం అమ్మకాలు ఒక అందివచ్చిన అవకాశంగా రాష్ట్రాలు భావిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మద్యం పై 70 శాతం పన్నును విధించింది. సోమవారం రోజు రాత్రి ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఢిల్లీ సర్కార్. కరోనా స్పెషల్ ఫీజు పేరుతో దీనిని వసూలు చేయనున్నారు.

దీనితో మద్యం రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఉదాహరణకు 100 రూపాయలుండే మద్యం సీసా ఇప్పుడు 170 రూపాయలవుతుంది. ఇలా వచ్చిన పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాను నింపుకునే వీలుంటుంది. 

ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఇలా మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీని చూసి, ఆ రద్దీని కట్టడి చేయడానికి ఇలా రేట్లను పెంచినట్టు చెప్పుకొచ్చింది. కానీ విమర్శకులు మాత్రం సోమవారం ఉదయమే ఈ నిర్ణయాన్ని కేజ్రీవాల్ సర్కార్ తీసుకుందని, అందుకోసమే ఆయన ఆదివారం రోజున రాష్ట్ర ఆదాయం గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే పది రెట్లు తగ్గిందనే లెక్క చెప్పారని అంటున్నారు. 

గత 24 గంటల్లో 2553 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కి చేరుకొందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో 1,074 మంది కరోనా నుండి కోలుకొన్నారని  కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

సోమవారం నాడు న్యూఢిల్లీలో ఆయన  మీడియాతో మాట్లాడారు. గత 24 గంటల్లో  కరోనాతో 73 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 1373 మంది మరణించారని లవ్ అగర్వాల్ చెప్పారు.దేశంలో కరోనా సోకిన రోగుల రికవరీ రేటు  27.52కు పెరిగిందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,453గా ఉందని కేంద్రం తెలిపింది. బెంగాల్ లో అధికంగా ఈ వైరస్ కారణంగా మరణించారని ఆయన తెలిపారు.

జోన్ల వారీగా లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెడ్ జోన్లు,కంటైన్మెంట్లలో ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.  ఒకరు నిర్వహించుకొనే వ్యాపారసంస్థలను తెరుచుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.ఆంక్షలను సడలించిన ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ ను పాటించకపోతే  కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

click me!