సుమారు 45 రోజుల తర్వాత బార్లు, వైన్ షాపులు ఓపెన్ చేయడంతో మద్యం ప్రియులు ఎగబడ్డారు. అయితే జనం ఒక్కసారిగా పోటెత్తడంతో కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఎవరూ సామాజిక దూరాన్ని పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఒకరిపై మరొకరు పడుతూ.. తోసుకుంటూ గుమిగూడారు
కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో మందుబాబుల బాధలు అన్నీ ఇన్నీ కావు. చుక్క లేనిదే నిద్రపోని వారంతా మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. కొందరైతే కంటికి కనిపించిన రసాయనాలను తాగేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలను పున: ప్రారంభించారు. దీంతో మందుబాబుల ప్రాణం లేచొచ్చినట్లయ్యింది. సుమారు 45 రోజుల తర్వాత బార్లు, వైన్ షాపులు ఓపెన్ చేయడంతో మద్యం ప్రియులు ఎగబడ్డారు.
Also Read:అసోంలో ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ: ఇది కూడ చైనా నుంచే...
అయితే జనం ఒక్కసారిగా పోటెత్తడంతో కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఎవరూ సామాజిక దూరాన్ని పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఒకరిపై మరొకరు పడుతూ.. తోసుకుంటూ గుమిగూడారు.
ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ప్రజలు సామాజిక దూరం పాటించకపోతే నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Also Read:లాక్ డౌన్ ఎత్తివేత.. సరి, బేసి విధానం అమలు?
ఏ ప్రాంతాల్లో ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించరో.. ఆ ప్రాంతాలను సీల్ చేస్తామని, అంతేకాకుండా సడలించిన ఆంక్షలను తిరిగి పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. మద్యం దుకాణాల వల్ల జనం ఎక్కువగా గుమికూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత దుకాణాదారులదేనని సీఎం చెప్పారు.
ఎవరైనా సామాజిక దూరం పాటించకుంటే ఆ దుకాణాన్ని మూసివేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అలాగే నిత్యావసర వస్తువులతో పాటు ఇతర పనుల మీద బయటకు వచ్చే వారంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.