ఐటీశాఖ బంపర్ ఆఫర్: ఆ సమాచారమిస్తే కోటి రూపాయలు

First Published Jun 1, 2018, 5:44 PM IST
Highlights

ఐటీ శాఖ బంపర్ ఆఫర్


న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని రూపుమాపేందుకు చర్యలు
తీసుకోవడంలో భాగంగా బినామీల సమాచారాన్ని ఇస్తే  కోటి
రూపాయాల నగదును రివార్డుగా అందించనున్నట్టు
ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

బినామీ ఆస్తులపై  ఉక్కు పాదం మోపేందుకు సర్కార్
చర్యలు తీసుకొంది.బినామీ ఆస్తుల వివరాలను పూర్తి
వివరాలతో ఆదాయపు పన్ను శాఖాధికారులకు ఇవ్వవచ్చని
ఐటీ శాఖ ప్రకటించింది.


ఈ సమాచారం బినామీ ఆస్తుల లావాదేవీల సవరణ చట్టం
కింద చర్యలు చేపట్టేందుకు అనువైనదిగా ఉండాలి. బినామీ
ఆస్తుల వెలికితీతకు దారితీసే సమాచారం అందించే
విదేశీయులూ రివార్డు స్కీమ్‌కు అర్హులేనని ప్రభుత్వం
తెలిపింది. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా
ఉంచుతారు.

బినామీ ఆస్తులు, కంపెనీలు, లావాదేవీలపై నిరంతర నిఘా
ఉంటుందని, బినామీ లావాదేవీలపై సమాచారం
అందచేసిన వారికి రివార్డు పథకం ప్రవేశపెడతామని బడ్జెట్‌
ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో
ఈ రివార్డ్‌ స్కీమ్‌ను ప్రకటించారు. 
 

click me!