మైనర్లైనా అంగీకారంతో సహజీవనంలో తప్పులేదు: కోర్టు

First Published Jun 1, 2018, 5:23 PM IST
Highlights

అంగీకారంతో సహజీవనంలో తప్పులేదు

తిరువనంతపురం: పెళ్ళి కాకున్నా యుక్త వయస్సు వచ్చిన
యువతీ, యువకుడు కలిసి జీవించవచ్చని  కేరళ హైకోర్టు తీర్పును ఇచ్చింది.

మేజర్లు కాకపోయిన యువతీ యువకులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఉందంటూ
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తన కూతురిని ఓ యువకుడు నిర్భందించాడంటూ ఓ తండ్రి వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

కేరళలలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన
ఓ వ్యక్తి తన కూతురుని ఓ యువకుడు
నిర్భందించాడంటూ కోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై జస్టిస్
వి. చిదంబరేష్, జస్టిస్ కేపీ జ్యోతింద్రనాథ్‌లతో కూడిన
హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. 

చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన వయసు రాకపోయినా యువతీయువకులు తమ పరస్పర అంగీకారంతో కలిసి జీవించొచ్చని తీర్పునిచ్చింది. మేజర్లయిన తరువాత ఇద్దరు వివాహం చేసుకోవచ్చినతీర్పులో పేర్కొంది.

click me!