యోగి ఆదిత్యనాథ్ కు పేలుడు పదార్థంతో బెదిరింపు లేఖ.. మధ్యప్రదేశ్ లో కలకలం..

By SumaBala BukkaFirst Published Jan 26, 2022, 12:40 PM IST
Highlights

మధ్యప్రదేశ్ లోని రేవా డివిజన్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ బెదిరింపు లేఖ, పేలుడు పదార్థం లభ్యం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  వచ్చే నెలలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపత్యంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు ఉగ్రవాద ముప్పు భయాన్ని పెంచుతోంది. 

భోపాల్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Yogi Adityanath కు బెదిరింపు లేఖతో పేలుడు పదార్థం పంపిన ఘటన మధ్యప్రదేశ్  రాష్ట్రంలో వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా పట్టణంలో టైమరుతో కూడిన Explosive పదార్థాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఘటనా స్థలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బెదిరిస్తూ letter లభించింది. జాతీయ రహదారి -30పై వంతెన కింద బెదిరింపు లేఖతో పేలుడు పరికరాన్ని పోలీసులు గుర్తించారు. 

పరికరం లభ్యమైన వెంటనే బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. మధ్యప్రదేశ్ లోని రేవా డివిజన్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ బెదిరింపు లేఖ, పేలుడు పదార్థం లభ్యం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  వచ్చే నెలలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపత్యంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు ఉగ్రవాద ముప్పు భయాన్ని పెంచుతోంది. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. ఓటల్ లెక్కింపు మార్చి 10న జరగనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు లేఖతో పాటు పేలుడు పదార్థం పంపిన ఘటన సంచనలం రేపింది. దీంతో యూపీలో సీఎం యోగికి భద్రతను పెంచారు. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరగనున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో అధికార బీజేపీకి, ప్రతిపక్షంలోని సమాజ్‌వాదీకి మధ్య గట్టి పోటీ కనిపిస్తున్నది. కాంగ్రెస్, బీఎస్పీలు ఎన్నికల పోటీలో వెనుకబడ్డాయి. బీజేపీ సీనియర్ నేతుల, కేంద్రంలోని మంత్రులు, ప్రధాని మోడీ సహా చాలా మంది ఉత్తరప్రదేశ్‌ పర్యటించారు. అభివృద్ధి పథకాలు ప్రకటించారు. ఇందుకు దీటుగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రాష్ట్రంలో ముమ్మర ప్రచారం చేశారు. 

అయితే, ఒక వారం రోజుల వ్యవధిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. బీజేపీ నుంచి మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఓబీసీ వర్గానికి ప్రముఖంగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనిపించే మంత్రులు బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం సంచలనానికి తెరతీసింది. వారం వ్యవధిలో బీజేపీ నుంచి మొత్తం 10 మంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ నుంచీ ఒకరు బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది.

రాష్ట్రంలోని ఓబీసీ ఓటర్లను చాలా వరకు ప్రభావితం చేసే ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీన వీడారు. వీరు అఖిలేష్ యాదవ్ సమక్షంలో జనవరి 14న సమాజ్‌వాదీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదే రోజు సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

యోగి ఆదిత్యానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌లోని ఓ దళిత ఇంటి (Dalit)లో ఆయన శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశారు. సామాజిక సామరస్యతను పెంపొందించే లక్ష్యం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గోరఖ్‌పూర్‌లోని జుంగియాకు చెందిన అమృత్ లాల్ భారతీజీ ఇంటిలో తనకు కిచిడీ, ప్రసాదం స్వీకరించే భాగ్యం కలిగిందని వివరించారు. ఇందుకు భారతీజీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

click me!