గులాంనబీ ఆజాద్ కు పద్మఅవార్డు.. ‘అజాద్ గా ఉండాలి...గులాంగా కాదు’ అంటూ విరుచుకుపడ్డ జైరాం రమేష్...

By SumaBala BukkaFirst Published Jan 26, 2022, 12:11 PM IST
Highlights

అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్జీ పద్మ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అతను ఆజాద్ గా ఉండాలనుకుంటున్నాడు.. గులామ్ అవ్వాలనుకోవడం లేదంటూ..’  గులాం నబీ ఆజాద్ పై  విరుచుకుపడ్డారు.అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎస్ హస్కర్ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

న్యూఢిల్లీ :  73rd Republic Day సందర్భంగా కేంద్రం ప్రకటించిన Padma awards జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత Ghulam Nabi Azad పేరు కూడా ఉంది. అయితే దీనిమీద ఆయన పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈమేరకు లోక్ సభ ఎంపీ Shashitharur  మాత్రం  ఆజాద్ కు అభినందనలు తెలిపారు.  అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బెంగాల్ ముఖ్యమంత్రి Buddhadev Bhattacharjee పద్మ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అతను ఆజాద్ గా ఉండాలనుకుంటున్నాడు..  గులామ్ అవ్వాలనుకోవడం లేదంటూ..’  గులాం నబీ ఆజాద్ పై  విరుచుకుపడ్డారు.

అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎస్ హస్కర్ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 1973లో మనదేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ ఉద్యోగి హస్కర్ పీఎంవో నుండి  నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్ ను అందజేస్తున్నట్లు పేర్కొంది. దీనికి హస్కర్ పుస్తకంలోని భాగానికి ‘ఇది అత్యుత్తమమైనది, అనుకరణ అర్హమైనది..’ అనే క్యాప్షన్ జోడించి మరీ ట్వీట్ చేశారు.  

అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్ పై నిర్ణయాన్ని బుద్ధదేవ్ bhattacharjee  భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్ గురించి  ఏమీ తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నానని అన్నారు. ఏది ఏమైనా ఈ అవార్డుల విషయమై కాంగ్రెస్ పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తింది. కానీ రమేష్ మాత్రం  గాంధీ పార్టీకి విధేయతగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు శశిధరూర్ మాత్రం.. ప్రతిపక్ష పార్టీ,  మరో పార్టీ నాయకుడి ప్రజా సేవలు గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం విశేషం అంటూ..  గులాంనబీ ఆజాద్ కు అభినందనలు తెలపడం గమనార్హం. అయితే   ఆజాద్ గతేడాది ఫిబ్రవరిలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేసిన సమయంలో ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. అయితే బుద్ధదేవ్‌ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మాత్రం సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రకటించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. పద్మభూషణ్‌ అవార్డు రావడంపై తనకేమీ తెలియదనీ.. దీనిగురించి ఎవరూ తనకు చెప్పలేదన్నారు. ఒకవేశ తాను పద్మ పురస్కారానికి ఎంపికైతే తాను దానిని తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి సీపీఎం పార్టీ సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది.

పార్టీ నిర్ణయం, బుద్ధదేవ్‌ భట్టాచార్య ఇదేనని పేర్కొంది. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బుద్ధదేవ్ భట్టాచార్య దానిని స్వీకరించడానికి నిరాకరించారని పేర్కొంది. తమ పని ప్రజల కోసమేనని.. అవార్డుల కోసం కాదని తెలిపింది.

పద్మభూషణ్ పురస్కారం గురించి ముందుగానే బుద్ధదేవ్‌ భట్టాచార్య భార్యకు తెలియజేశామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అవార్డు గురించి కేంద్ర హోం కార్యదర్శి బుద్ధదేవ్ భట్టాచార్య భార్యతో మాట్లాడారని.. ఆమె అవార్డును స్వీకరించి కృతజ్ఞతలు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక,  మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారు.

click me!