
బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది, ఒక కస్టమర్ ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బ్యాగులో ఉంచిన వస్తువు పేలినట్లు ప్రాథమిక సమాచారం.
బీజేపీ నేతలకు బ్రెయిన్ లేదు.. నేను రామ భక్తుడినే.. ఆలయాలనూ నిర్మించా - సిద్ధరామయ్య..
రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించిన వెంటనే వైట్ ఫీల్డ్ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బెంగళూరులో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫుడ్ జాయింట్లలో ఈ కేఫ్ ఒకటిగా ఉంది.
క్షతగాత్రులను స్థానికులు, అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..