Explainer: పార్లమెంట్ క్యాంటీన్‌లో టీడీపీ, బీజేడీ, బీఎస్పీ ఎంపీలతో ప్రధాని లంచ్.. అసలు మతలబు ఇదేనా?

By Mahesh K  |  First Published Feb 9, 2024, 8:04 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పార్లమెంటు క్యాంటీన్‌లో ప్రతిపక్ష ఎంపీలతో ఆకస్మికంగా లంచ్‌కు ప్లాన్ చేశారు. ఎనిమిది మంది ఎంపీలను భోజనానికి తీసుకెళ్లి తినిపించారు. ఇందులో టీడీపీ, బీజేడీ, బీఎస్పీ ఎంపీలూ ఉన్నాయి. ఈ మూడు పార్టీలూ ఇటు ఎన్డీయేలోగానీ.. అటూ ఇండియా కూటమిలోగానీ లేకపోవడం గమనార్హం. దీంతో ప్రధాని ప్రకటించిన 400 టార్గెట్‌‌ అచీవ్ చేయడానికి ఈ లంచ్ ఉపకరిస్తుందని చెబుతున్నారు.
 


Parliament Canteen: పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నట్టుండి ప్రతిపక్ష ఎంపీలతో లంచ్ చేసే నిర్ణయం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రతిపక్ష ఎంపీలకు ఫోన్ చేసి మీ అందరికీ ఈ రోజు పనిష్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నా.. పార్లమెంట్ క్యాంటీన్ రావాలని వారిని ఇన్వైట్ చేశారు. లిప్తకాలంపాటు వారు కూడా ఆశ్చర్యపోయారు. ప్రధానమంత్రి మోడీతో లంచ్? అది కూడా నిమిషాల వ్యవధిలోనే? ఇంత స్వల్ప సమయంలో షెడ్యూల్? వారికంతా ఏమీ అర్థం కాలేదు. కానీ, ప్రధాని మోడీతో లంచ్‌కు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అంతా పార్లమెంటు క్యాంటీన్‌లోకి వెళ్లారు. ఎనిమిది ఎంపీలతో ప్రధాని మోడీ ఈ రోజు లంచ్ చేశారు. వారంతా శాకాహారమే తిన్నారు. కొందరు రాగి లడ్డూలు తీసుకున్నారు. తనతో లంచ్‌కు ప్రధానమంత్రి మోడీ బీజేపీ ఎంపీలు హీనా గావిత్, ఎస్ ఫాంగ్నాక్ కొన్యాక్, జమయంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలను ఆహ్వానించారు. లంచ్ పూర్తయ్యాక బిల్లు కూడా తన వైపు నుంచే చెల్లించాలని అధికారులకు ప్రధాని మోడీ సూచించినట్టు తెలిసింది.

Latest Videos

ప్రధాని ఇలా ప్రతిపక్ష ఎంపీలకు ఫోన్ చేసి లంచ్‌కు ఇన్వైట్ చేయడం.. ఆ లంచ్‌లో ఆహ్లాదకర సంభాషణ చేయడం.. అంతా గమ్మత్తుగా జరిగిపోయింది. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు చాలా ఖుషీగా ఉన్నారు. అయితే.. ఈ లంచ్ వెనుక కూడా పొలిటికల్ ఫార్ములా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: CM Revanth Reddy: గూడ అంజన్న చివరి కోరిక కేసీఆర్‌ను చూడాలని..కానీ.. : సీఎం రేవంత్ రెడ్డి

ఇక్కడ బీజేపీ ఎంపీలు మినహా మిగిలిన పార్టీలతో బీజేపీకి పొత్తు లేదు. టీడీపీతో పొత్తు విషయమై ఇప్పుడిప్పుడే చర్చలు వేగమందుకున్నాయి. బీజేడీ మాత్రం ఎప్పటిలాగే బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తున్నది. బీఎస్పీ కూడా ఇటు ఎన్డీయేలో అటూ ఇండియా కూటమిలోనూ లేదు. ప్రధాని మోడీ ఈ లంచ్ ద్వారా బీజేడీ, బీఎస్పీ, టీడీపీలను ఎన్డీయేలోకి తీసుకునే అవకాశాలను రెట్టింపు చేసుకున్నాడని చెబుతున్నారు. తద్వార ఇది వరకే ఆయన పార్లమెంటులో ప్రకటించిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, మొత్తం ఎన్డీయేకు 400 సీట్లు గెలుస్తామనే లక్ష్యానికి చేరువయ్యే మార్గాన్ని సమీపించాడని వివరిస్తున్నారు. ఈ పార్టీలు కూడా బీజేపీకి మద్దతుగా నిలబడితే 400 లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

click me!