ఈ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి 350 కి పైగా సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వే సంస్థలయితే మోదీ హవా పీక్స్ లో వుంది కాబట్టి 400 కు పైగా సీట్లు వస్తాయని చెెబుతున్నాయి. ఏ సర్వే ఫలితాలు ఎలా వున్నాయంటే..
Exit Poll Results 2024 : దేశవ్యాప్తంగా బిజెపి హవా కొనసాగుతూనే వుందని... ఈ లోక్ సభ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల కంటే ఈసారి బిజెపి సీట్ల సంఖ్య పెరుగుతుందని... ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం ఖాయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కొన్ని సంస్థల సర్వేలు అయితే ఎన్డిఏ కూటమి 400 సీట్లు కూడా దాటే అవకాశాలు వున్నాయంటున్నాయి. ఇదే జరిగితే ''అబ్ కీ బార్ - చార్ సౌ పార్'' అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బిజెపి అనుకున్నది సాధించినట్లే.
మొత్తంగా ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ బిజెపి, ఎన్డిఏ కూటమికే ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. ఇండియా టివి-సిఎన్ ఎక్స్, జన్ కీ బాత్ సర్వేలు ఎన్డిఏకు 362-392 వరకు ఎంపీ సీట్లను గెల్చుకుంటాయని అంచనా వేస్తున్నాయి. ఇక రిపబ్లిక్ భారత్ 359, ఇండియా న్యూస్- డి-డైనమిక్స్ 371, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 353-368, దైనిక్ భారత్ 281-350, న్యూస్ నేషన్ 342-378 సీట్లు ఎన్డిఏకు వస్తాయని చెబుతున్నాయి.
undefined
ఈసారి ఎగ్జిట్ పోల్ సర్వేల్లో ఆసక్తికర విషయం ఏమిటంటే ఉత్తరాదిన పట్టు నిలుపుకుంటూనే దక్షిణాదిన బిజెపి బలం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బిజెపి అత్యద్భుత ప్రదర్శన చేస్తుందట. తెలంగాణలో రెండంకెల లోక్ సభ సీట్లు సాధిస్తుందని... ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఎంపీలతో పాటు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఈసారి కూడా దక్షిణాదిన కర్ణాటకలోనే బిజెపి అత్యధిక సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో ఈసారి బిజెపి ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటుందని కొన్ని... సీట్లు కూడా సాధిస్తుందని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి.
ఇక మహారాష్ట్రలో బిజెపి బలం మరింత పెరిగిందని... అక్కడ అత్యధిక సీట్లు ఆపార్టీకే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ ఈసారి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచిందని... ఈ రాష్ట్రంలో బిజెపి అత్యధిక సీట్లు సాధిస్తుందట. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుండి బిజెపికి 22 మంది ఎంపీలుంటే ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత పెరగనుందని చాలా సర్వేలు చెబుతున్నాయి.
ఇక ఉత్తరాదిన ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎప్పటిలాగే బిజెపి హవా కొనసాగుతుందని సర్వేలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ల స్వరాష్ట్రం గుజరాత్ లో బిజెపి క్లీన్ స్వీప్ చేయనుందట. మిగిలిన రాష్ట్రాల్లోనూ బిజెపి, ఎన్డిఏ కూటమి పార్టీలకే అత్యధిక సీట్లు వస్తాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
సర్వే సంస్థలు, పార్టీల వారిగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు :
ఎన్డి టివి : ఎన్డిఏ 361 - ఇండి కూటమి 145 - ఇతరులు 37
ఏబిపి న్యూస్-సి ఓటర్ సర్వే : ఎన్డిఏ 353-383 - ఇండి కూటమి 152-182 - ఇతరులు 4-12
దైనిక్ భాస్కర్ : ఎన్డిఏ 281-350 - ఇండి కూటమి 145-201 - ఇతరులు 33-49
ఇండియా న్యూస్-డి-డైనమిక్స్ : ఎన్డిఏ 371 - ఇండి కూటమి 125 - ఇతరులు 47
ఇండియా టివి-సిఎన్ఎక్స్ : 371-401 - ఇండి కూటమి 109-139 - ఇతరులు 28-38
జన్ కీ బాత్ : 362-392 - ఇండి కూటమి 141-161 - ఇతరులు 10-20
న్యూస్ నేషన్ : ఎన్డిఏ 342-378 - ఇండి కూటమి 153-169 - ఇతరులు 21-23
రిపబ్లిక్ టివి - మ్యాట్రిజ్ - ఎన్డిఏ 353-368 - ఇండి కూటమి 118-133 - ఇతరులు 43-48
టైమ్స్ నౌ- ఈటిజి : ఎన్డిఏ 358 - ఇండి కూటమి 152 - ఇతరులు 33
రిపబ్లిక్ టివి - పి మార్క్ - ఎన్డిఏ 359 - ఇండి కూటమి 154 - ఇతరులు