Jan Ki Baat Exit Poll Ls Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ జూన్ 1న ముగిసింది. ఏడు దశల్లో నిర్వహించిన ఓటింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ వచ్చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం జన్ కీ బాత్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం దేశంలో మళ్లీ మోడీ ప్రభుత్వం ఏర్పడబోతోంది.
JAN KI BAAT EXIT POLL LS ELECTIONS 2024: లోక్‌సభ ఎన్నికల 2024 చివరి దశ ఓటింగ్ జూన్ 1న ముగిసింది. ఏడు దశల్లో నిర్వహించిన ఓటింగ్‌తో పాటు ఎగ్జిట్ పోల్ కూడా వచ్చేసింది. వివిధ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలుస్తోంది. ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ విజయాన్ని అందుకోనుంది. ఎన్డీయే 377 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అదే సమయంలో, ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి 151 సీట్లకే పరిమితం కానుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఆ పార్టీ కేవలం 52 సీట్లకు పరిమితం కావచ్చు. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీయేకు 377 (+-15), ఇండియా కూటమికి 151 (+-10), ఇతరులకు 15 (+-5) సీట్లు రావచ్చు. ఇక బీజేపీకి 327 (+-15) సీట్లు రావచ్చు, దేశంలోని 543 స్థానాల్లో మెజారిటీ ఫిగర్ 272.
ఏన్డీయేకు 50 శాతం ఓట్లు
ఓట్ల వాటా గురించి మాట్లాడితే, ఏన్డీయే 50% (+-1%) ఓట్లను పొందగలదు. అదే సమయంలో, కాంగ్రెస్ ఓట్ షేర్ 35% (+-1%), ఇతరుల ఓట్ షేర్ 15% (+-1%) గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
బీజేపీ కి 2019 కంటే భారీ విజయం..
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించే అవకాశాన్ని కూడా ప్రస్తావించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ తన పేలవమైన పనితీరును మరోసారి కొనసాగించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 2024లో కాంగ్రెస్‌కు మళ్లీ దాదాపు 52 సీట్లు వచ్చే అవకాశం ఉంది.