దీదీకి మరో షాక్.. బీజేపీలోకి శతాబ్ధి రాయ్..?

By Siva KodatiFirst Published Jan 15, 2021, 7:19 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేత సుబేందు అధికారితో పాటు మరికొందరు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేత సుబేందు అధికారితో పాటు మరికొందరు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా మరో ఎంపీ కూడా కమల తీర్థం పుచ్చుకుంటారనే వార్తలొస్తున్నాయి. అయితే సదురు ఎంపీ వర్గం మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించడం లేదు. ఆ ఎంపీ ఎవరో కాదు... తృణమూల్ ఎంపీ శతాబ్ది రాయ్.

ఆమె శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానుండటంతో పుకార్లుకు బలం చేకూరినట్లయ్యింది. దీనిపై ఆమెను వివరణ అడగ్గా... ‘‘అమిత్‌షాతో భేటీ అయితే తప్పేంటి? తానో ఎంపీనని, ఎవరితోనైనా భేటీ కావచ్చని అని శతాబ్ది రాయ్ తేల్చి చెప్పారు.

2009లో మొదటిసారిగా తాను ఎంపీగా ఎన్నికైన సమయంలో.. ఈమె నటి.. రాజకీయవేత్త కాదన్న వారికి నేనేంటో నిరూపించానని తెలిపారు. మమతా బెనర్జీ జరిపిన రోడ్‌షోకు తనను ఆహ్వానించారని, ఆ సందర్భంలోనే టీఎంసీలో చేరినట్లు శతాబ్ధి రాయ్ గుర్తుచేశారు.

మమత ఆహ్వానిస్తేనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అలాగని పిలవని కార్యక్రమాలకూ పరిగెత్తుకుంటూ ఎలా వెళ్తానని శతాబ్ధి సూటిగా చెప్పారు. పార్టీ తనను స్టార్‌ను చేయలేదని, స్వతహాగా తానే ఓ స్టార్‌నని, పార్టీ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాల్సిందేనని ఆమె కుండబద్ధలు కొట్టారు.  

తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని కొందరు అడుగుతున్నారని అయితే పార్టీ ఆహ్వానించనకుండా ఎలా వెళ్తానని ఆమె ప్రశ్నించారు. ఇకపోతే ‘‘తారాపిత్ వికాస్ పరిషత్’’ బాధ్యతలకు శతాబ్ధి రాయ్ రాజీనామా చేశారు. ఈ ఘటనలతో ఆమె పార్టీని వీడనున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

click me!