ప్రత్యేకం: దొంగ పశ్చాత్తాపం, చోరీ చేసిన బంగారం గొలుసు సువర్ణ న్యూస్ యాంకర్ పంపి....

By Siva KodatiFirst Published Sep 18, 2020, 7:10 PM IST
Highlights

నగరాల్లో చైన్ స్నాచింగ్ లు కొత్తేమీ కాదు. చైన్ స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉంటారు. సినిమాల్లో కూడా మహిళల మెడలోని గొలుసులను లాక్కు వెళ్తుంటే హీరోలు వెంబడించి వారిని పట్టుకునే సాహస కృత్యాలను సినిమాల్లో చూస్తుంటాం.

నగరాల్లో చైన్ స్నాచింగ్ లు కొత్తేమీ కాదు. చైన్ స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉంటారు. సినిమాల్లో కూడా మహిళల మెడలోని గొలుసులను లాక్కు వెళ్తుంటే హీరోలు వెంబడించి వారిని పట్టుకునే సాహస కృత్యాలను సినిమాల్లో చూస్తుంటాం. బాధితులకు హీరోలు వాటిని తిరిగిచ్చేసి తమ హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 

కానీ ఈ రోజు, అంటే సెప్టెంబర్ 18వ తేదీని విస్తుపోయే, ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నడ మీడియా పరిశ్రమ చరిత్రలోనే తొలి సారిగా ఆ సంఘటన చోటు చేసుకుంది. ఓ చైన్ స్నాచర్ బెంగళూరులో గొలుసు లాక్కెళ్లాడు. అయితే, అతను దాన్ని విక్టిమ్ కు తిరిగిచ్చేయాలని కోరుతూ సువర్ణ న్యూస్ కన్నడ చానెల్ ను ఆశ్రయించాడు. 

తాను దొంగిలించిన బంగారం గొలుసును సువర్ణ న్యూస్ యాంకర్ జయప్రకాశ్ శెట్టికి పంపించాడు. ఆయనపై నమ్మకంతో ఆ చైన్ స్నాచర్ దాన్ని పంపించాడు. దాన్ని విక్టిమ్ కు ఇచ్చేయాల్సిందిగా చైన్ స్నాచర్ జయప్రకాశ్ రెడ్డిని కోరాడు. 

విచిత్రంగా చైన్ స్నాచర్ తాను దొంగతనం చేసిన గొలుసు యజమాని చిరునామా కూడా ఇచ్చాడు. దాంతో సువర్ణ న్యూస్ గొలుసు యజమానిని కనిపెట్టి సువర్ణ న్యూస్ ఆ వ్యక్తి కుటుంబాన్ని తమ స్టూడియోకి పిలిచింది.

చోరీ జరిగిన బంగారం గొలుసు పోస్టులో జయప్రకాశ్ శెట్టి చిరునామాకు చేరింది. గోల్డ్ చైన్ ను పంపిస్తూ జయప్రకాశ్ శెట్టికి అతను ఓ లేఖ కూడా రాశాడు. 

 

 

తొలిసారి తాను ఈ విధమైన నేరం చేశానని చైన్ స్నాచర్ ఆ లేఖలో చెప్పాడు. తనకు ఉద్యోగం లేదని, తన నయాపైసా కూడా లేదని, కరోనా కారణంగా తాను స్థితికి వచ్చానని అతను చెప్పాడు. అలా చేసి ఉండకుండా ఉండాల్సిందని తాను ఆ తర్వాత గ్రహించానని ఆయన చెప్పాడు.

అతను విచారం వ్యక్తం చేస్తూ ప్రజలకు, బెంగళూరు పోలీసులకు సారీ చెప్పాడు. తన వల్ల బాధపడిన కుటుంబానికి సువర్ణ న్యూస్ ద్వారా గొలుసును పంపిస్తున్నాని అతను చెప్పాడు. గొలుసును తిరిగి ఇచ్చేయడానికి జయప్రకాశ్ శెట్టికి బెంగళూరు పోలీసులు సాయపడ్డారు. 

సెప్టెంబర్ 9వ తేదీన బెంగళూరులోని ఇందిరా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కస్తూరి గొలుసును అతను దొంగిలించాడు. ఆమెతో పాటు ఆమె భర్త వెంటే పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితురాలు సువర్ణ న్యూస్ స్టూడియోకు వచ్చి 80 గ్రాముల బంగారం గొలుసును తీసుకున్నారు. 

గొలుసు పోయిన తర్వాత తాము ఎంతో వేదన అనుభవించామని, అందువల్ల తాము చైన్ స్నాచర్ ను క్షమించదలుచుకోలేదని కస్తూరి, ఆమె భర్త బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.
 

click me!