వ్యవసాయ బిల్లు కాంగ్రెస్ మానిఫెస్టోలో కూడా ఉంది: బాంబు పేల్చిన బహిష్కృత నేత

By team teluguFirst Published Sep 18, 2020, 5:58 PM IST
Highlights

కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ ఝా బాంబు పేల్చారు. ఏపిఎంసి చట్టం రద్దు, వ్యవసాయాన్ని ఉత్పత్తులపై కొనసాగుతున్న నియంత్రణల్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కూడా తన 2019 మానిఫెస్టోలో పొందు పరిచిన విషయం బయటపెట్టాడు.

లోక్ సభ లో వ్యవసాయానికి సంబంధించిన బిల్లు దేశంలో సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని, ఇన్నీ కావు. ఏకంగా కేంద్ర మంత్రి, అకాలీదళ్ నేత హరిసిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు కూడా. 

ఈ విషయం కాక రేపుతున్న తరుణంలో కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ ఝా బాంబు పేల్చారు. ఏపిఎంసి చట్టం రద్దు, వ్యవసాయాన్ని ఉత్పత్తులపై కొనసాగుతున్న నియంత్రణల్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కూడా తన 2019 మానిఫెస్టోలో పొందు పరిచిన విషయం బయటపెట్టాడు. 

Folks, in our Congress Manifesto for 2019 Lok Sabha elections, we had ourselves proposed abolition of APMC Act and making agricultural produce free from restrictions. This is what Modi government has done in the farmers bills. BJP and Congress are on the same page here.

— Sanjay Jha (@JhaSanjay)

ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అని.... అదే విషయాన్నీ మోడీ చేసి చూపారన్నారు సంజయ్ ఝా. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్నీ చెప్పారు. తాము పాస్ చేసిన ఆర్డినెన్సును... కాంగ్రెస్ కూడా తమ మానిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేసారు. 

ఈ ఆర్డినెన్సు వల్ల రైతులకు దళారుల నుండి, దళారీ వ్యవస్థ నుండి పూర్తి విముక్తి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తమ మానిఫెస్టోలో ఈ విషయం పొంది పరిచిన పార్టీలు కూడా ఇప్పుడు ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణి ప్రదర్శించే వారిని నమ్మొద్దని, రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు. 

click me!