మనవరాలిమీద లైంగిక వేధింపులు.. కోడలు ఫిర్యాదు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య....

Published : May 28, 2022, 12:28 PM IST
మనవరాలిమీద లైంగిక వేధింపులు.. కోడలు ఫిర్యాదు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య....

సారాంశం

ఉత్తరాఖండ్ రాజకీయ నాయకుడు రాజేంద్ర బహుగుణ మనవరాలిని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ అతని కోడలు కేసు పెట్టింది. ఇలా పెట్టిన మూడు రోజులకు ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

డెహ్రాడూన్ :  కోడలి ఫిర్యాదుతో తీవ్ర మనస్తాపం చెందిన Uttarakhand మాజీ మంత్రి Rajendra Bahuguna బలవన్మరణానికి పాల్పడ్డారు. బహుగుణ బుధవారం హల్ద్ వాని ప్రాంతంలోని తన నివాసంలో వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. కాగా తన కూతురిని Sexual harassment చేస్తున్నట్లు కోడలు మామ రాజేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు బాహుగుణ మీద Pocso Act కింద కేసు నమోదైంది. ఇది జరిగిన మూడు రోజులకే బహుగుణ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. బహుగుణ ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను బతకలేనని, చనిపోతున్నట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.  

దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునేలోపే బహుగుణ తన ఇంటిముందు ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాడు. అయితే లౌడ్ స్పీకర్ ఉపయోగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, కిందికి దిగి రావాలని పోలీసులు మాజీ మంత్రిని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసుల మాటలు వినకుండా నేను ‘ఏ తప్పూ చేయలేదు. నా పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అంటూ గట్టిగా అరిచాడు. ఒక సమయంలో పోలీసులు విజ్ఞప్తి మేరకు కిందికి దిగి వస్తాడనుకున్న క్రమంలో అనూహ్యంగా వాటర్ ట్యాంకు పై తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.

పోలీసులు, ఇరుగుపొరుగువారు చూస్తుండగానే బహుగుణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే కోడలు చేసిన ఆరోపణలపై తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు తండ్రిని ఆత్మహత్యకు ప్రేరేపించారని కొడుకు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి అలాగే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడైన బహుగుణ  2004-05లో  ఎన్.డి.తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో ఆయనను తప్పిస్తూ ముఖ్యమంత్రి Sawant నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గోవా అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి Milind Naik లైంగిక వేధింపుల ఆరోపణలతో బుధవారం మంత్రి పదవికి resign సమర్పించారు. 

ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆ రోజు అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. నిస్పక్షపాతంగా న్యాయ విచారణ జరిగేలా చూసేందుకు మంత్రి నాయక్ రాజీనామా చేసినట్లు సీఎంఓ పేర్కొంది. నాయక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని, దానిని ఆమోదించి గవర్నర్ కు పంపినట్లు సీఎంఓ ట్వీట్ లో పేర్కంది. మిలింద్ నాయక్ కు లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపించడంతో మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 

దక్షిణ గోవాలోని మోర్ముగావ్ అసెబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి Pramod Sawant మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని గత మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అంతకుముందు రోజు మంత్రి నాయక్ కేబినెట్ మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఒక మహిళను లైంగికంగా వేదించాడని కాంగ్రెస్ గోవా చీఫ్ Girish Chodankar ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు