తెలిసింది మాట్లాడు.. తెలియనిది నీకెందుకు: గంభీర్‌కు ఒమర్ వార్నింగ్

By Siva KodatiFirst Published Apr 3, 2019, 8:58 AM IST
Highlights

బీజేపీలో చేరిన మాజీ టీమిండియా క్రికెటర్ గౌతంగంభీర్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లాల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. 

బీజేపీలో చేరిన మాజీ టీమిండియా క్రికెటర్ గౌతంగంభీర్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లాల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధానిని నియమించే దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మరోసారి ప్రయత్నం చేస్తోందన్న ఒమర్ అబ్ధుల్లా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు గంభీర్. దీనిపై ట్వీట్టర్ సాక్షిగా గౌతం విరుచుకుపడ్డారు.

‘‘ ఒమర్ అబ్ధుల్లా.. జమ్మూకశ్మీర్‌కు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు... తాను సముద్రాలపై నడవాలంటే వీలవుతుందా.. ఆయనకు విశాంత్రి కావాలి.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగి నిద్రపోండి.. లేదంటే పాకిస్తాన్ పాస్‌పోర్ట్ తీసుకోవాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన ఒమర్ అబ్ధుల్లా ‘‘ గంభీర్, నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు.. ఎందుకంటే నాకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు.. నీకు జమ్మూకశ్మీర్ గురించి తెలియదు.. జమ్మూకశ్మీర్ చరిత్ర, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేషనల్ కాన్ఫరెన్స్ చేసిన కృషి గురించి గంభీర్‌కు ఏం తెలుసు.

ఇకనైనా గంభీర్ తనకు తెలిసిన విషయాలపై మాట్లాడితే మంచిది. తనకు తెలిసిన ఐపీఎల్ గురించి ట్వీట్లు పెడితే అందరూ స్వాగతిస్తారు. అంటూ ఒమర్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

click me!