ఆగని కవ్వింపులు: భారత సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాలు

By Siva KodatiFirst Published Apr 2, 2019, 11:19 AM IST
Highlights

సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు ఓ భారీ డ్రోన్... భారత భూభాగానికి దగ్గర్లో చక్కర్లు కొట్టినట్లు రాడార్లు గుర్తించాయి.

పంజాబ్‌లోని ఖేమ్‌కరణ్ సరిహద్దు ప్రాంతంలోకి అవి వచ్చినట్లు గుర్తించిన భారత్.. సుఖోయ్ ఎస్‌యూ, మిరాజ్ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టేందుకు ప్రయత్నించడంతో అవి వెంటనే పాక్ భూభాగం వైపుకు వెనుదిరిగాయి.

గత నెలలో పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా భారత వైమానిక దళం సర్జికల్ స్టైక్స్ జరిపిన విషయం తెలిసిందే. దీంతో ఆ మరుసటి రోజే పాక్.. భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియా ..పాక్ విమానాలను తిప్పికొట్టింది. 

click me!