
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీ అధిపతి కె. కస్తూరిరంగన్‌కు సోమవారం శ్రీలంకలో గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత చికిత్స నిమిత్తం విమానంలో బెంగళూరు తరలించారు.
కస్తూరిరంగన్ చికిత్సను నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవి శెట్టి పర్యవేక్షిస్తున్నారని ఒక అధికారి తెలిపారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సైన్స్ , విద్యారంగంలో ఆయన చేసిన కృషికి గానూ పద్మవిభూషణ్, పద్మభూషణ్ , పద్మశ్రీ లభించాయి. కస్తూరిరంగన్ (83) జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. అతను 2003 నుండి 2009 వరకు రాజ్యసభ సభ్యుడుగా సేవలందించారు. ఇప్పుడు భారత ప్రణాళికా సంఘం సభ్యుడుగా కూడా వ్యవహరించారు. ఇది మాత్రమే కాదు.. ఆయన (కస్తూరిరంగన్) 2004 నుండి 2008 వరకు (అప్పటి) బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ ఎడ్యుకేషన్‌కు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
ఆయన ఆరోగ్యంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. భారత శాస్త్రవేత్త కస్తూరిరంగన్‌కు శ్రీలంకలో గుండెపోటు వచ్చిందని తెలియడం బాధాకరమని ట్వీట్‌లో రాశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.