
ఈ రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియని వారు ఉండరేమో. ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించి ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫోటోలను పెళ్లి కొడుకుగా, చిన్న పిల్లాడిలా మార్చి షేర్ చేశారు. తాజాగా,టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోలు మార్ఫింగ్ చేయడం విశేషం.
విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెటర్ అనే విషయం మనకు తెలుసు. ఆయన క్రికెట్ ఆడుతుండగా కూడా చూశాం. అయితే, ఒకవేళ ఆయన డాక్టర్ అయితే, లేదంటే పైలెట్ అయితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? దానికి ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది. కొందరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కోహ్లీ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ గా మారాయి.
సాహిద్ అనే AI ఔత్సాహికుడు ఇదే పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో మల్టీవర్స్‌లో విరాట్ కోహ్లీ చిత్రాలు ఉన్నాయి. సరే, అతను ఒకదానిలో రాజులా పోజులిచ్చాడు మరియు మరొకదానిలో గిటారిస్ట్‌గా ఉన్నాడు. ఒకదానిలో ఫుట్‌బాల్ ఆటగాడు. మరొకదానిలో పోలీసుగా ఉండటం విశేషం.
"విరాట్ కోహ్లీ మల్టీవర్స్" అని పోస్ట్ కి క్యాప్షన్ పెట్టడం విశేషం. ఇప్పుడు ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.