జైలులో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించిన భార్య.. బైటికొచ్చి అనుమానంతో ఆమెను కాల్చి చంపి..

Published : Jun 12, 2023, 12:54 PM IST
జైలులో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించిన భార్య.. బైటికొచ్చి అనుమానంతో ఆమెను కాల్చి చంపి..

సారాంశం

జైలులో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి బైటికి తీసుకువచ్చిందో భార్య. అలా బైటికి వచ్చిన అతను అనుమానంతో భార్యను కాల్చి చంపాడు.   

బరేలీ : తన జీవిత భాగస్వామి తనను మోసం చేస్తుందనే అనుమానంతో నాటు తుపాకీతో భార్యను కాల్చి చంపాడో కిరాతకుడు. అతను పదిహేను రోజుల క్రితమే బెయిల్ మీద బైటికి వచ్చాడు. ఆ బెయిల్ కూడా భార్యే ఇప్పించడం గమనార్హం. 40 ఏళ్ల ఆ వ్యక్తి - తన 32 ఏళ్ల భార్య మీద రద్దీగా ఉండే మార్కెట్‌ప్లేస్‌లో కాల్చి చంపాడు. శనివారం సాయంత్రం బరేలీలోని ఫతేగంజ్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

నిందితుడు కృష్ణపాల్ లోధి తన భార్య పూజ మీద అనేక రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. ఆమెతో పాటు పూజ స్నేహితుడైన మున్నా (30)పై కూడా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం మున్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  పోలీసులు పూజా మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో, కృష్ణపాల్ తన భార్య తనను మోసం చేసిందని అనుమానించాడని, అందుకే ఆమెను కాల్చివేసినట్లు చెప్పాడు. 

‘సంస్కారవంతమైన పిల్లల’ కోసం రామాయణం చదవండి.. గర్భిణీలకు తెలంగాణ గవర్నర్ సలహా...

"ఆమె చనిపోవడానికి అర్హురాలు, అందుకే నేను ఆమెను చంపాను, దీనిమీద నాకు ఎటువంటి విచారం లేదు" అని కృపాపాల్ చెప్పాడు. కాగా, పూజా, కృపాపాల్ లది ప్రేమవివాహం. 2012లో పూజ, కృష్ణపాల్ లు ఇంటినుంచి పారిపోయారని, వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం ఆమె బ్యూటీ పార్లర్‌ను నడిపేది.కృష్ణపాల్ గతంలో హత్యాయత్నం కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. 

ఘటన జరిగిన వెంటనే హత్యాయుధంతో అతడిని పట్టుకున్నారు. ఎస్పీ (నగరం) బరేలీ, రాహుల్ భాటి మాట్లాడుతూ, "నిందితుడిని జైలుకు పంపించాం. ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది." అని తెలిపారు. 

దీనిమీద పూజ తల్లి షీలాదేవి మాట్లాడుతూ.. కృష్ణపాల్‌ మద్యానికి బానిసై రోజూ రాత్రి నా కూతురిని కొట్టేవాడు. శనివారం క్రిష్ణపాల్‌ మద్యం మత్తులో ఇంటికి వచ్చి మైనర్‌ కొడుకుల ముందే పూజను తిట్టాడు. కోపోద్రిక్తుడై కంట్రీ మేడ్ పిస్టల్ తీశాడు. దీంతో పూజ భయాందోళనకు గురై ఇంటి నుండి బయటకు పరుగెత్తింది. కానీ, అతను ఆమెను వెంబడించి కాల్చి చంపాడు" అని రోధిస్తూ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు