Teleprompter PM: ఆయ‌న అబద్ధాలను టెలిప్రాంప్టర్ భరించలేదు... మోడీపై రాహుల్ గాంధీ చురకలు...

By Rajesh KFirst Published Jan 18, 2022, 2:45 PM IST
Highlights

Teleprompter PM: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధాని మోడీకి చురకలు వేశారు. దావోస్‌లో  వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సదస్సులో మోదీ ప్రసంగిస్తుండగా టెలిప్రాంప్టర్ సక్రమంగా పని చేయడంతో ప్ర‌సంగం కాసేపు ప్ర‌చారం నిలిపివేశారు.  అబద్ధాలను టెలిప్రాంప్టర్ సైతం భరించలేకపోయిందని ఎద్దేవా చేశారు. 
 

Teleprompter PM: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఊహించ‌ని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ స‌మ్మిట్ లో ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయ‌న ఉప‌యోగిస్తున్న‌టెలిప్రాంప్టర్ పని చేయ‌డం ఆగిపోయింది. దీంతో ప్రధాని కాసేపు తత్తరపాటుకు గురయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక అయోమయానికి గురయ్యారు. దీంతో త‌న ప్ర‌సంగాన్ని మ‌ధ్య‌లోనే నిలివేశారు. 

ఈ ఘ‌ట‌నపై ప్ర‌తిప‌క్షాలు విరుచుక‌పడుతున్నాయి. టెలిప్రాంప్టర్ లేకపోతే- ఆయన ఏమీ మాట్లాడలేరంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై  భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ త‌నదైన శైలిలో స్పందించారు. సెటైరిక్ పంచుల‌తో ట్విట్ చేశాడు. ప్ర‌ధాని మోడీని..  టెలిప్రాంప్టర్ ప్రధాని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌ధాని చెప్పే అబద్ధాలను టెలిప్రాంప్టర్ కూడా ప‌నిచేయ‌డం మానివేసిందంటూ ఎద్దేవా చేశారు. మోడీ ఒక్క ముక్క మాట్లాడలేరని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుండ‌గా..  #TeleprompterPM అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ హ్యాష్‌ట్యాగ్ మీద వేలాది ట్వీట్లు , రిట్వీట్లు అవుతున్నాయి.  
 
ప్రతి యేడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు ఏర్పాటయ్యే విషయం తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ స‌మావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 22 వ‌ర‌కు ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం రాత్రి ప్రారంభమైంది.  
తొలి రోజు స‌మావేశంలో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్, జపాన్ ప్రధానమంత్రి కిషిడ ఫ్యూమియో, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సువా వాన్‌డెర్ లెయెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ లు ప్రసంగించారు. ఈ స‌మ్మిట్ లో ప్ర‌ధాని మోడీ కూడా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. 


ఈ సదస్సులో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ దేశంలోని రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ సమస్యను పరిష్కరించడానికి తన పరిపాలన అమలు చేసిన సంస్కరణలను ప్రధాని మోదీ వివరించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాని ఉప‌యోగిస్తున్న టెలిప్రాంప్టర్ ఆసాక్మ‌త్తుగా పనిచేయ‌డం ఆగిపోవ‌డంతో ఆయన ప్రసంగం   స్తంభించిపోయింది. పని చేయడం మానేసింది. అనుకోకుండా చోటు చేసుకున్న ఈ ఘటనలో మోడీ కొంత తత్తరపాటుకు గురయ్యారు. దీంతో హెడ్ ఫోన్స్ తీసివేసి.. లాస్ ఆఫ్ సిగ్నల్స్.. అని చెప్పారు. ఇలా టెలిప్రాంప్టర్ పనిచేయ‌క‌పోవ‌డంతో మోడీ తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలివేశారు.

click me!