రాముడొచ్చి పోటీచేసినా.. డబ్బులు ఖర్చు చేయాల్సిందే

By ramya neerukondaFirst Published Sep 27, 2018, 2:44 PM IST
Highlights

తమపై నమ్మకం కల్గించేందుకు నాయకులు వీరికి డబ్బు లేదా బహుమతులు ఇస్తుంటారు. ఎన్నికల్లో డబ్బుకు అధిక ప్రాబల్యం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాముడొచ్చి పోటీ చేసినా.. డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆయన గెలవలేరు


గోవా ఆరెస్సెస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్ .. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్తు శ్రీరామ చంద్రుడు వచ్చి పోటీ చేసినా.. గెలవడానికి డబ్బులు ఖర్చు చేయాల్సిందే నని సుభాష్ అన్నారు. పనాజీలో గోవా సురక్ష మంచ్‌ యువ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రెండు వర్గాల ప్రజలను ఆకర్షించడంలో బిజీగా ఉంటారు. ఒకరు యువత, మరొకరు మహిళలు. తమపై నమ్మకం కల్గించేందుకు నాయకులు వీరికి డబ్బు లేదా బహుమతులు ఇస్తుంటారు. ఎన్నికల్లో డబ్బుకు అధిక ప్రాబల్యం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాముడొచ్చి పోటీ చేసినా.. డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆయన గెలవలేరు’ అని వెలింగ్కర్‌ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌పై కూడా వెలింగ్కర్‌ విమర్శలు చేశారు. ‘అనారోగ్యంగా ఉన్నారని పారికర్‌ తన కేబినెట్‌ నుంచి ఇద్దరు మంత్రులను తీసేశారు. ఇప్పుడు ఆయనే అనారోగ్యానికి గురయ్యారు’ అని ఎద్దేవా చేశారు. గోవాలో ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని వెలింగ్కర్‌ ఆరోపించారు. సామాన్యులు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే.. ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు మాత్రం చిన్న అస్వస్థతకే అమెరికా వెళ్తున్నారని దుయ్యబట్టారు.

click me!