ఇష్టపూర్వక వివాహేతర శృంగారం: 497 సెక్షన్ ఏం చెబుతోంది?

By narsimha lodeFirst Published Sep 27, 2018, 1:36 PM IST
Highlights

భారతీయ పీనల్ కోడ్ (ఐపీసీ) 497సెక్షన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  సుప్రీంకోర్టు ఈ చట్టం పురాతనమైన చట్టంగా  గురువారం నాడు అభివర్ణించింది. అసలు 497 సెక్షన్ అంటే ఏమిటో తెలుసుకొందాం.


న్యూఢిల్లీ: భారతీయ పీనల్ కోడ్ (ఐపీసీ) 497సెక్షన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  సుప్రీంకోర్టు ఈ చట్టం పురాతనమైన చట్టంగా  గురువారం నాడు అభివర్ణించింది. అసలు 497 సెక్షన్ అంటే ఏమిటో తెలుసుకొందాం.

ఐపీసీ 497 సెక్షన్ ప్రకారంగా ఈ కేసులో ఎక్కువగా పురుషులే బాధితులుగా ఉంటున్నారు. ఈ సెక్షన్ ప్రకారంగా తన అనుమతి లేకుండా వేరొకరి భార్యతో ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ఈ నేరారోపణతో శిక్షించబడతాడు.

అయితే ఈ కేసు కింద ఇప్పటివరకు పెద్ద ఎత్తున  పురుషులు శిక్షలు పొందారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై  సెక్షన్ 497 ను సవాల్ చేస్తూ  జోసెఫ్ షినే అనే వ్యక్తి కూడ సుప్రీంకోర్టులో ఇటీవలనే కేసు కూడ దాఖలు చేశారు.

ఈ సెక్షన్ ఆధారంగా పురుషులను ఒక్కరినే శిక్ష చేయడం సరైంది కాదని ఆయన  కోర్టును ఆశ్రయించాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నిజమని తేలితే స్త్రీలను మినహాయించి పురుషులకు శిక్షలు పడడంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు.ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపాలని కూడ కూడ సుప్రీంకోర్టు కోరింది.

ఇదిలా ఉంటే ఈ కేసు కింద ఎలాంటి వారంట్ లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. కోర్టు అనుమతి లేకుండానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నేరం రుజువైతే  ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడ కోర్టు విధించే అవకాశం ఉంది.  ఈ రెండింటిలో ఏదైనా విధించే అవకాశం ఉంది. లేదా రెంటింటిని కూడ అమలు చేయవచ్చు.

ఈ సెక్షన్ కింద స్త్రీలే బాధితులుగా  చట్టం చెబుతోంది.అందుకే ఈ సెక్షన్ కింద స్త్రీలకు శిక్షలు విధించడం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

సంబంధిత వార్తలు

ఇష్టపూర్వక వివాహేతర శృంగారానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్

 

 

click me!