అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు

Published : Sep 27, 2018, 02:27 PM ISTUpdated : Sep 27, 2018, 02:46 PM IST
అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు

సారాంశం

అయోధ్య కేసును విస్తృత ధర్మాసనానికి బదలాయించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 

న్యూఢిల్లీ: అయోధ్య కేసును విస్తృత ధర్మాసనానికి బదలాయించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 

అయోధ్య కేసులో గురువారం నాడు  సుప్రీం కోర్టు  తీర్పు వెలువరించింది.అన్ని ప్రార్థనాస్థలాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

1994 నాటి కేసు కేవలం భూ సేకరణకు సంబంధించింది మాత్రమేనని కోర్టు అభిప్రాయపడింది.అయోధ్య భూ యాజమాన్య హక్కులపై అక్టోబర్ 29వ తేదీన విచారణ జరపనున్నట్టు కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే జస్టిస్ మిశ్రా, జస్టిస్ భూషణ్ వాదనతో  మరో న్యాయమూర్తి నజీర్  ఏకీభవించలేదు.

వచ్చే నెల 29వ తేదీన భూ యాజమాన్య హక్కులపై  విచారన అయోధ్య కేసులో కీలకం కానుంది. 2010లో అయోధ్యలోని వివాదాస్పద భూమిని  అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించింది.  ముస్లింలు, హిందువులకు  పంచింది. 16వ, శతాబ్దానికి చెందిన బాబ్రీమసీదును 1992లో కరసేవకులు ధ్వంసం చేశారు. 

 ఇస్లాంలో దేవుడిని ప్రార్థించేందుకు మసీదులు తప్పనిసరి కాదంటూ 1994లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కీలక తీర్పును వెలువరించింది.

అయోధ్య రామజన్మభూమి వివాదంలో భాగంగా 1994లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ పలు ముస్లిం సంస్థలు, సిద్ధిక్ అనే వ్యక్తి రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిసన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే