అమ్మవారికి కోవిడ్ భయం..! దుర్గాదేవి విగ్రహానికి మాస్క్.. !!

By AN TeluguFirst Published Apr 16, 2021, 1:10 PM IST
Highlights

ప్రజల్లో కరోనా అవగాహన కల్పించడం కోసం ఓ పూజారి వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా దుర్గాదేవికే మాస్క్ పెట్టి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఈటానగరంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. 

ప్రజల్లో కరోనా అవగాహన కల్పించడం కోసం ఓ పూజారి వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా దుర్గాదేవికే మాస్క్ పెట్టి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఈటానగరంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు నానాటికీ పెరుగిపోతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు కోవిడ్ మార్గదర్శకాల విషయంలో జనాల్ని పదేపదే హెచ్చరిస్తూ..  తప్పనిసరిగా అనుసరించాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుడికి వచ్చే భక్తులకు మాస్క్ ప్రాముఖ్యత మీద అవగాహన కల్పించడానికి, దుర్గామాట ఆలయంలోని పూజారి ఒకరు వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా దుర్గామాల విగ్రహానికే మాస్క్ తొడిగి అవగాహన కల్పిస్తున్నాడు. 

మాస్క్ వేసుకున్న దుర్గామాత ఫొటోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్  చైత్ర నవరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు  మాస్క్ ధరించిన దుర్గాదేవి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

వీరి ఆశ్చర్యాన్ని మరింత పెంచుతూ ఆలయ పూజారి ప్రసాదంగా మాస్కులను పంపిణీ చేశారు. దుర్గా ఆలయంలోని పూజారి పండిట్ మనోజ్ శర్మ మాట్లాడుతూ, "భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. కాబట్టి, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇలా దేవత విగ్రమానికి మాస్క్ పెట్టాలని నిర్ణయించుకున్నా." అన్నారు.

భక్తులలో కోవిడ్ నిబంధనల మీద అవగాహన కల్పించడానికి ఫేస్ మాస్క్‌లను ‘ప్రసాదంగా’ గా పంపిణీ చేస్తున్నాము. ఆలయంలో హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశాం, దేవాలయంలో పలుచోట్ల కోవిడ్ నిబంధనావళిని ఏర్పాటు చేశామని తెలిపారు.  దీనివల్ల ప్రజారోగ్యానికి ఎలాంటి హాని కలిగించకుండా భక్తులు బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. 

ఇక ఉదయం, సాయంత్రం జరిగే ఆరతి కార్యక్రమంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ చర్యలతో ఇప్పుడు ఈ ఆలయం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. కోవిడ్ నియమాల మీద వీరు అనుసరిస్తున్న విధానాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. 

click me!