ఇండియాలో కోరలు చాస్తున్న కరోనా: ఒక్క రోజులోనే రెండు లక్షలు దాటిన కేసులు

Published : Apr 16, 2021, 10:52 AM IST
ఇండియాలో కోరలు చాస్తున్న కరోనా: ఒక్క రోజులోనే రెండు లక్షలు దాటిన కేసులు

సారాంశం

 దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  10 రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య రెట్టింపు అయింది. కేసులు పెరిగిపోవడంతో  ఆసుపత్రులు కూడ సరిపోవడం లేదు.

  న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  10 రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య రెట్టింపు అయింది. కేసులు పెరిగిపోవడంతో  ఆసుపత్రులు కూడ సరిపోవడం లేదు.దేశంలో  14,73,210 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే  2,17,353 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరుకొంది.గత 24 గంటల్లో 1,185 మంది కరోనాతో మరణించారు. 

కరోనాతో దేశంలో  1,74,308 మంది చనిపోయారు.ఇంకా 15 లక్షల యాక్టివ్ కేసులున్నట్టుగా  కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  గత 24 గంటల్లో కరోనా నుండి 1,18,302 మంది బయటపడ్డారు. దీంతో కరోనా నుండి బయటపడిన వారి సంఖ్య 1.25 కోట్లకు చేరుకొంది.

యాక్టివ్ కేసుల శాతం 10.46 శాతానికి పెరిగింది. రికవరీ రేటు  88.31కి పడిపోయింది.  ఫిబ్రవరిలో ఇది 97 శాతానికి పైగా ఉండేది.  మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి.   మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌ఘడ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడ ఈ వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.ఈ వైరస్ తీవ్రతను తగ్గించేందుకు గాను  దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని   కేంద్రం నిర్ణయంం తీసుకొంది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !