బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి గవర్నర్ లేఖ: శాంతి భద్రతలపై సంచలనం

By narsimha lodeFirst Published Oct 18, 2020, 6:21 PM IST
Highlights

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయలని రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ దంకర్ సీఎం మమత బెనర్జీకి లేఖ రాశారు.బెంగాల్ రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిందని ఆయన అభివర్ణించారు. పోలీస్ కస్టడీలో మరణించిన మదన్ గొరాయి మరణించిన విషయం తెలిసిందే.


న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయలని రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ దంకర్ సీఎం మమత బెనర్జీకి లేఖ రాశారు.బెంగాల్ రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిందని ఆయన అభివర్ణించారు. పోలీస్ కస్టడీలో మరణించిన మదన్ గొరాయి మరణించిన విషయం తెలిసిందే.

ఈ ఘటన అమానవీయమైన ఘటన అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ హింస, కక్షసాధింపు చర్యలు, కస్టడీ వేధింపులు పెచ్చుమీరాయని గవర్నర్ ఆరోపించారు.

సీఎం మమత బెనర్జీకి గవర్నర్ రాసిన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించారు.ఈ తరహా ఘటనలు చట్ట నిబంధనల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎంకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

also read:బెంగాల్ సీఎం మమతపై అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ నేతకు కరోనా

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. పోలీసుల రాజ్యంగా రాష్ట్రం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.ఈ తరహా ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

click me!