ఇంజనీర్ ఘాతుకం: భార్యను ఏడు ముక్కలుగా కోశాడు

Published : Jun 27, 2018, 07:24 AM IST
ఇంజనీర్ ఘాతుకం: భార్యను ఏడు ముక్కలుగా కోశాడు

సారాంశం

ఓ ఇంజనీర్ అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. భార్యను చంపి ఆమె శరీరాన్ని ఏడు ముక్కలుగా కోశాడు. 

న్యూఢిల్లీ: ఓ ఇంజనీర్ అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. భార్యను చంపి ఆమె శరీరాన్ని ఏడు ముక్కలుగా కోశాడు. ఉద్యోగం మారుతున్నందుకు వేధిస్తుందనే ఆగ్రహంతో ఆయన ఈ పనిచేశాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో జరిగింది.

సాజిద్‌ అలీ అన్సారీ అనే ఇంజనీరుకు 2011లో జుహితో వివాహమైంది. సాజిద్‌ ఇటీవల తరచుగా ఉద్యోగం మారుతూ వస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అతను భార్యపై కోపం పెంచుకున్నాడు.

ఆ కోపంతో ఆమెను చంపేశాడు. తన ఇద్దరు సోదరుల సహాయంతో ఆమె శవాన్ని ముక్కలుగా కోసి ఓ అట్టపెట్టెలో ప్యాక్‌ చేసి ఆగ్నేయ ఢిల్లీలోని సరిత విహార్‌లో పడేశాడు. అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

అట్టపెట్టెపై ఉన్న చిరునామాతో ఓ ప్రైవేటు ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థను విచారించారు. తాము అక్తర్‌కు పంపినట్లు తెలిపింది. అతన్ని విచారించగా తన ఇంట్లో అద్దెకు ఉండే సాజిద్‌కు అట్టపెట్ట ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu