మనీలాండరింగ్ కేసు : మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్య ఇంట్లో ఈడీ సోదాలు..

By AN TeluguFirst Published Jun 25, 2021, 12:09 PM IST
Highlights

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించింది.

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ రైడ్స్ నాగ్‌పూర్‌లలోని అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో జరుగుతున్నాయి. 

ఈడి మరో బృందం ముంబైలోని వర్లి ప్రాంతంలో ఉన్న దేశ్‌ముఖ్ మరో నివాసంలో కూడా దాడులు నిర్వహించింది. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరమ్ బిర్ సింగ్ మీద అవినీతి ఆరోపణల నేపథ్యంలో అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 

సింగ్ ఇప్పటికే ఈ ఆరోపణలమీద సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నాడు. సింగ్ ఆరోపణల ప్రకారం, అప్పటి అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ కోసం దేశ్ముఖ్ 100 కోట్ల రూపాయల వసూలు చేయాలని చెప్పాడని ఆరోపించారు.  

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దేశ్ ముఖ్, ఇతరుల మీద గతనెలలోనే సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇప్పుడు వీరిమీద ఎఫ్ఐఆర్  కూడా నమోదయ్యింది.

ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బిర్ సింగ్ దేశ్ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. వీటిని పరిశీలించిన ముంబై హైకోర్టు దీనిమీద విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించింది. ఆ  తరువాత ఈ కేసు ఈడీకి వచ్చింది.

click me!