మాంసం కూర వండలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు.. ఇంకో యువతితో వివాహం..

By AN TeluguFirst Published Jun 25, 2021, 11:20 AM IST
Highlights

పెళ్లిళ్లలో గొడవలు మామూలే.. ముఖ్యంగా వరుడి తరఫు వారు గొంతెమ్మ కోరికలు కోరుతూ.. వధువు తరఫు బంధువుల్ని ఇబ్బంది పెట్టడం.. నానా హంగామా చేయడం మామూలే. పూలుగుబొక్క వేయలేదని, నిమ్మకాయ షర్బత్ ఇవ్వలేదని పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకున్న ఘటనలు కోకొల్లలు.. అయితే మారుతున్న కాలంతో పాటు ఇలాంటి ఘటనల్లో మార్పులు వచ్చాయి.

నేడు ఇలాంటి సంఘటనలు వినిపించడం లేదు. అయితే తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటన జరిగింది. పెళ్లి విందులో మటన్ కర్రీ పెట్టలేదని గొడవ పెట్టుకోవడమే కాకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అంతేకాదు మరుసటి రోజే మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది కూడా. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి వరుడితో పాటు తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. అయితే.. ఈ పెళ్లిలో మటన్ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు అడిగాడు. అయితే ఆ విందులో మేకమాంసం లేదు. 

ఆ విషయం వధువు బంధువులు చెప్పగానే.. వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరికి పెళ్లికొడుకు పెళ్లి రద్దుచేసుకునే దాకా వెళ్లింది. 

వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసి తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. అక్కడ్నుండి వరుడు, అతని బంధువులు అదే జిల్లలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే తమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని వరుడు పెళ్లి చేసుకున్నాడు. 
 
click me!