రాబందులను ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి స్మగ్లింగ్..!

By Ramya news teamFirst Published Jan 21, 2022, 11:10 AM IST
Highlights

సుల్తాన్ పూర్- ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లోని సెకండ్ క్లాస్ స్లీపర్ ఖోచ్ లోని ప్రయాణికులు తమ కంపార్ట్ మెంట్ లో దుర్వాసన, పక్షులు శబ్దం వస్తుండటంతో... వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
 

రాబందులను ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ కు చెందిన 60ఏళ్ల వ్యక్తి కాన్పూర్ నుంచి మహారాష్ట్రలోని మాలేగావ్ కు రాబందులను స్మగ్లింగ్ చేశాడు. కాగా.. ఆ స్మగ్లింగ్ రాకేట్ ను పోలీసులు చేధించారు.

సుల్తాన్ పూర్- ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లోని సెకండ్ క్లాస్ స్లీపర్ ఖోచ్ లోని ప్రయాణికులు తమ కంపార్ట్ మెంట్ లో దుర్వాసన, పక్షులు శబ్దం వస్తుండటంతో... వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా.. దాడి చేయగా.. సంచుల్లో కుక్కిన రాబందులు కనిపించాయి. ఈ రాబందులను ఈజిప్ట్ నుంచి.. స్మగ్లింగ్ చేశారని అధాకరులు తెలిపారు. అటవీశాఖ, ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి.. మొత్తం ఏడు ఈజిప్టియన్ రాబందులను కనుగొన్నట్లు అధికారులు చెప్పారు.

సదరు వ్యక్తిని.. పక్షులతో సహా పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో స్మగ్లర్ ఫరీద్ షేక్ తనకు ఈ రాబందులను కాన్పూర్ స్టేషన్ లోని నగరానికి చెందిన సమీర్ ఖాన్ ఇచ్చాడని చెప్పాడు. ఆ పక్షులను మాలేగావ్ కు తీసుకువెళ్లి ఒక హసీమ్ కి ఇవ్వమని ఖాన్  చెప్పాడన్నారు.

రాబందులను రవాణా చేయడానికి సమీర్ ఖాన్ షేక్ ₹ 10,000 ఆఫర్ చేశాడని వారు పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాబందులను అటవీశాఖకు అప్పగించారు.
 

click me!