కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదులు హతం

Siva Kodati |  
Published : Mar 01, 2019, 09:14 AM IST
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదులు హతం

సారాంశం

భారత్-పాక్ మధ్య హైటెన్షన్ కొనసాగుతోంది. శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు సైన్యానికి చిక్కగా... ఇద్దరు హతమయ్యారు. పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సాధారణ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్ సైనికుల కాల్పులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. 
 
PREV
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu