బీజేపీ ఓడితే.... మళ్లీ కరప్షన్, దేశం ఐసీయూలోకి: కార్యకర్తలతో మోడీ

By Siva KodatiFirst Published Mar 1, 2019, 8:02 AM IST
Highlights

కాంగ్రెస్, టీడీపీలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు ‘‘మేరా బూత్ సబ్‌సే మజ్బూత్’’ కార్యక్రమంలో భాగంగా ఆయన దేశ వ్యాప్తంగా 15,000 ప్రాంతాల నుంచి కార్యకర్తలతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాంగ్రెస్, టీడీపీలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు ‘‘మేరా బూత్ సబ్‌సే మజ్బూత్’’ కార్యక్రమంలో భాగంగా ఆయన దేశ వ్యాప్తంగా 15,000 ప్రాంతాల నుంచి కార్యకర్తలతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్ విభజిస్తే.... టీడీపీ నాశనం చేసిందన్నారు. కాంగ్రెస్, టీడీపీలపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘ తమిళనాడులో పటిష్ట కూటమిని ఏర్పాటు చేశామని, ఆ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విజయం ఎన్డీయేకు దక్కబోతోందన్నారు. అటు కేరళ ప్రజలు సైతం ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లపై విసిగిపోయారని, కర్ణాటకలో సైతం కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయడం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు.

రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామికంగా పనిచేసే బీజేపీ, వారసత్వ రాజకీయాలు నడిపే కాంగ్రెస్, ఇతర పార్టీలలో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘ప్రపంచంలోని ఐదు దుర్బల దేశాల్లో’’ భారత్ ఒకటిగా ఉండేదని... ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించామన్నారు.

వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోని టాప్-5 అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా చేస్తామని నరేంద్రమోడీ చెప్పారు. మహాకూటమిని మహా కల్తీ కూటమిగా అభివర్ణించిన ఆయన అది దేశాన్ని ఐసీయూలోకి పంపేస్తుందని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలోకి మళ్లీ ఈజ్ ఆఫ్ కరప్షన్ వస్తుందని ప్రధాని ధ్వజమెత్తారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడమే ప్రతిపక్షాలు మాస్టర్స్ అని....అదే వాటి ఎజెండా అని మోడీ ఆరోపించారు.

దక్షిణాదిలో ఈ సారి ఎన్డీయేకు మరిన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ విశాఖపట్నం రానున్నారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన ఆయన ఏపీకి మరిన్ని వరాలు కురిపిస్తారా..? లేక టీడీపీ అధినేతపై విమర్శలు చేస్తారా అని రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

click me!