వాఘా వద్ద అభినందన్‌ను అప్పగించనున్న పాక్: రిసీవ్ చేసుకోనున్న ఎయిఫోర్స్

By Siva KodatiFirst Published Mar 1, 2019, 8:54 AM IST
Highlights

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం భారత్‌కు అప్పగించనుంది. అయితే ఆయన ఏ విధంగా స్వదేశానికి తిరిగి వస్తారన్న దానిపై దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం భారత్‌కు అప్పగించనుంది. అయితే ఆయన ఏ విధంగా స్వదేశానికి తిరిగి వస్తారన్న దానిపై దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ అభినందన్‌ను వాఘా బోర్డర్ వద్ద భారత్‌కు అప్పగించేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఆయనను రావల్పిండి నుంచి లాహోర్‌కు తరలిస్తారు.

జెనీవా ఒప్పందం మేరకు అక్కడ అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి అభినందన్‌ను అప్పగిస్తారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు ఆయనను తీసుకుని లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో వాఘా వద్దకు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో చేరుకుని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు అభినందన్‌ను అప్పగిస్తారు.

మరోవైపు వర్థమాన్‌ను తాను రిసీవ్ చేసుకుంటానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ప్రస్తుతం తాను భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో పర్యటిస్తున్నాని, అమృత్‌సర్‌కు దగ్గర్లో ఉన్నానన్నారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్ధులుగా అభినందన్‌కు స్వాగతం పలకడం తనకు ఎంతో గౌరవంగా ఉంటుందని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. 

తమ అదుపులో ఉన్న వింగ్ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు అప్పగిస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ .. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. జెనీవా ఒప్పందాన్ని గౌరవించడంతో పాటు భారత్‌తో శాంతిచర్చలకు ఈ చర్యను తొలి మెట్టుగా ఆయన అభివర్ణించారు. 

అభినందన్ భారత్‌కు వచ్చే మార్గమిదే

తలొగ్గిన పాక్..అభినందన్‌కు రేపు విముక్తి : ఇమ్రాన్ ప్రకటన

అభినందన్‌ గుండె ధైర్యాన్ని మెచ్చుకున్న పాక్ మీడియా

click me!