Emerald Shivling: బ్యాంక్ లాకర్‌లో అత్యంత విలువైన మరకత లింగం .. దాని విలువ తెలిస్తే షాక్..

By Rajesh KFirst Published Jan 2, 2022, 3:28 AM IST
Highlights

Emerald Shivling: తమిళనాడులోని తంజావూరులో ఓ వ్యక్తి బ్యాంకు లాకర్ నుంచి రూ.500 కోట్లు విలువచేసే మరకత శివ లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సామియపన్ అనే వ్యక్తి ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు పోలీసుల‌కు సమాచారం అందింది.  సోదాలు నిర్వ‌హించ‌గా.. బ్యాంకు లాకర్‌లో విలువైన శివ లింగం లభించిందని ఏడీజీపీ కే జయంత్ మురళి చెప్పారు. 
 

Emerald Shivling: వెయ్యేళ్ల  చరిత్ర కలిగిన అరుదైన పురాతన మరకత శివలింగం ఒకటి తమిళనాడులోని తంజావూరులో బ‌య‌ట‌ప‌డింది.  అత్యంత విలువైన శివలింగాన్నిఓ వ్యక్తి బ్యాంకు లాకర్ నుంచి తమిళనాడు ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం చోళుల కాలం నాటిదిగా  గుర్తించారు. ఈ శివలింగం విలువ 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరులో గురువారం చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే..  తంజావూరులోని అరుళనంద నగర్ లో సామియపన్ అనే వ్యక్తి ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు పోలీసుల‌కు సమాచారం అందింది. ఆ స‌మాచారం మేర‌కు పోలీసు అధికారులు డిసెంబర్‌ 30న సామియపన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని ప్రశ్నించగా తన తండ్రి ఎన్ఏ సామియప్పన్ (80) తంజావూరులోని బ్యాంకు లాకర్‌లో ఓ పురాతన శివలింగాన్ని దాచిపెట్టినట్టు ఎన్ఎస్ అరుణ్ తెలిపాడు. ఆయ‌న‌ ఇచ్చిన స‌మాచారం మేర‌కు బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: దేశాభివృద్ధిని కరోనా అడ్డుకోలేదు.. సువర్ణాధ్యాయం లిఖించండి: ప్రధాని మోడీ న్యూ ఇయర్ మెసేజ్

అయితే దానికి సంబంధించిన ధ్రువపత్రాలేవి నిందుతుల వద్ద లేవని అధికారులకు అర్థమైంది. దీంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని.. దాని వివరాలను బయటపెట్టారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీనిని పురాతనమైనదిగా  పోలీసులకు తెలిపాడు. ఈ శివలింగం విలువ 500 కోట్లు ఉంటుందని జెమాలజిస్టులు అంచనా వేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నైలో వెల్లడించారు. అయితే తన తండ్రి సామియప్పన్‌కు ఈ శివలింగం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పారని పేర్కొన్నారు. దీంతో నిందితుడ్ని  అరెస్టు చేసినట్లు  వెల్లడించారు.

Read Also: Earthquake: కశ్మీర్​లో భూకంపం.. ​ రిక్టర్‌ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

అదనపు పోలీసు సూపరింటెండెంట్లు ఆర్ రాజారామ్, పి అశోక్ నటరాజన్ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తంజావూరులోని అరులనంద నగర్‌, సెవెన్త్ క్రాస్, లంగ్వల్ హోమ్స్‌లో ఎన్ఎస్ అరుణ్‌ అనే వ్యక్తి‌‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలిపారు. తన తండ్రి ఎన్ఏ సామియప్పన్ (80) తంజావూరులోని బ్యాంకు లాకర్‌లో ఓ పురాతన శివలింగాన్ని దాచిపెట్టినట్టు అరుణ్ చెప్పారని, ఆ తర్వాత దానిని దర్యాప్తు కోసం తమకు అందజేశారని తెలిపారు.

మొత్తం 530 గ్రాముల బరువు.. 8 సెంటీమీటర్ల బరువున్న ఈ శివలింగం విలువ రూ.500 కోట్లు వరకు ఉంటుందని జెమాలజిస్టులు అంచనా వేశారని చెప్పారు.  అంతేకాదు, 2016లో నాగపట్టణంలోని తిరుకువలై శివాలయంలో దొంగ‌త‌నానికి గురైనది . ఈ శివలింగమేనా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. నిందితుడు సామియప్పన్ విచారణకు సహకరిస్తున్నారని, ఈ ఘటనపై కేసు నమోదుచేశామని ఏడీజీపీ జయంత్ వివరించారు.

click me!