Earthquake: కశ్మీర్​లో భూకంపం.. ​ రిక్టర్‌ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

By Rajesh KFirst Published Jan 2, 2022, 2:07 AM IST
Highlights

Earthquake: కొత్త ఏడాది తొలి రోజే.. జమ్ముకశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని స‌మాచారం. పాకిస్థాన్​లోనూ 5.3 తీవ్రతతో భూమి కంపించింది.
 

Earthquake:  కొత్త ఏడాది తొలి రోజే .. జమ్ముకాశ్మీర్​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం సాయంత్రం 6:45 గంటల  స‌మయంలో కశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. అఫ్గానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్ములోనూ ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించ‌డంతో జనాలు భ‌యాందోళ‌నకు గుర‌య్యారు . ప‌లు ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించ‌డంతో జనాలు ఇళ్లు వదిలి రోడ్లపైకి, మైదాన ప్రాంతాల‌కు పరుగులు తీశారు.

భూమి పొరల నుంచి శబ్దాలు వినపడంతో జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ భూప్రకంపనల నేపథ్యంలో కొన్ని ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయి. గోడలకు పగుళ్లు రావడమే కాకుండా బీటలు వారుతున్నాయి. ఈ క్రమంలోనే జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.గ‌త నాలుగు రోజుల కిత్రం కూడా జమ్మూ కాశ్మీర్‌లో భూమి కంపించింది. దీని తీవ్ర‌త  5.3 గా న‌మోదు అయ్యింది. 

Read Also: నాసిక్ లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

మ‌రోవైపు పాకిస్థాన్ లో కూడా భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. ఉత్తర పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంక్వా రాష్ట్రంలో శనివారం ఉద‌యం.. భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ తోపాటు స్వాత్, పెషావర్, దిగువ దిర్, స్వాబి, నౌషేరా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఖైబర్​ పఖ్తుంక్వా ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూమి కంపించిన‌ట్టు అధికారులు తెలిపారు.

Read Also: California Earthquake: ఉత్తర కాలిఫోర్నియాలో తీవ్ర భూకంపం.. వణికిన జనం..

ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం జరగ‌లేద‌ని  తెలుస్తోంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  అలాగే.. ఇస్లామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల‌తో పాటు పెషావర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్తాన్ లోనూ భూ ప్రకంపనలు వ‌చ్చాయి. భారత్ పాక్ మధ్య నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్ఓసీ) వెంబడి కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించిందని  పాకిస్తాన్ వాతావరణ విభాగం (పీఎండీ) ప్రకటించింది.

click me!