మొహర్రం ఊరేగింపులో అపశృతి.. కరెంట్ షాక్ తో నలుగురు మృతి...

Google News Follow Us

సారాంశం

జార్ఖండ్‌లోని బొకారోలో శనివారం ఉదయం మొహర్రం ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది.  మొహర్రం వేడుకలు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

జార్ఖండ్ : శనివారం జార్ఖండ్‌లోని బొకారోలో విషాద ఘటన వెలుగు చూసింది. మొహర్రం ఊరేగింపులో నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు, మరో 13 మంది గాయపడ్డారు. 'టాజియా' 11,000 హై-వోల్టేజ్ టెన్షన్ వైర్‌ కు తాకడంతో ఈ సంఘటన జరిగింది, ఫలితంగా పేలుడు సంభవించింది.

ఈ ఘటన తర్వాత గాయపడిన వారందరినీ వెంటనే బొకారో థర్మల్ డీవీసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 13 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

ఛీ.. మద్యం కోసం స్నేహితుల దగ్గర భార్యను తాకట్టు పెట్టిన భర్త.. వారితో అత్యాచారం చేయించి...

ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్ట్ లో కూడా ఇలాంటి ప్రమాదమే గుజరాత్ లో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో పదిహేను మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు మొహర్రంను పురస్కరించుకుని తాజియా ఊరేగింపులో పాల్గొంటున్నారు.

క్షతగాత్రులందరినీ జామ్‌నగర్‌లోని జీజీ ఆస్పత్రిలో చేర్పించారు. రంజాన్ తర్వాత, మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్‌లో రెండవ పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెల మొదటి రోజును తరచుగా హిజ్రీ లేదా అరబిక్ నూతన సంవత్సరంగా పాటిస్తారు. ముస్లింలు మొహర్రంపై విపరీతమైన శ్రద్ధచూపుతాయి. ఇది సంతాప సమయంగా పరిగణించబడుతుంది.

మొహర్రం మాసంలో కర్బలా యుద్ధంలో ప్రవక్త ఇమామ్ హుస్సేన్ మరణించారు. తజియా అనేది ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపంగా చెబుతారు. తజియా అనే పదం అజా అనే అరబిక్ పదం నుండి వచ్చింది, దీని అర్థం చనిపోయినవారిని స్మరించుకోవడం. ముస్లీం సంఘం సభ్యులు తాజియాతో పాటు డ్రమ్స్‌తో ఊరేగింపులో యా హుస్సేన్ అని నినాదాలు చేస్తారు.