
తమిళనాడు : తమిళనాడులో బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు చోటు చేసుకుంది. కృష్ణగిరి పాతపేటలోని ఓ గోడౌన్ జరిగింది. ఈ ఘటనలో 4గురు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుడు దాటికి సమీపంలోని ఐదు ఇల్లు ధ్వంసమయ్యాయి.
శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీపేలుడు ధాటికి శరీరాలు చెల్లాచెదురయ్యాయి. పేలుడు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.
బాణాసంచాను ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.