Voter ID transfer: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటర్ ఐడీని బదిలీ చేసుకోవడం ఎలా?

By Rajesh Karampoori  |  First Published Mar 15, 2024, 6:24 AM IST

Voter ID transfer: ఇల్లు మారినా, జిల్లా మారినా, రాష్ట్రం మారినా.. తప్పకుండా మీ ఓటరు ఐడీలో చిరునామాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మీరు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్ లైన్ లోనూ పూర్తి చేయొచ్చు. ఎలా అప్డేట్ చేసుకోవాలని మీ కోసం.. 
 


Voter ID transfer: చాలామంది ఉద్యోగం కోసమో లేదా మరేదైనా కారణాలతోనో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్తారు.  అలాంటప్పుడు వారు ముఖ్యమైన పత్రాలపై చిరునామాను మార్చవలసి ఉంటుంది.  అలాగే.. ఆ రాష్ట్రంలో ఓటరు గుర్తింపు కార్డును కూడా అప్‌డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం వారు కార్యాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఇంట్లోనే కూర్చోని ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకుందాం..

ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? 

Latest Videos

undefined

>> ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.

>> అందులో హోమ్‌పేజీ దిగువన మీరు ఓటర్ ID కార్డ్‌ అప్‌డేట్ అనే అప్షన్ ఉంటుంది. దానిపై  క్లిక్ చేస్తే.. వెంటనే ఫారం 8 కనిపిస్తుంది. 

>> అందులో వివరాలు అంటే.. పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం, ప్రాంతం, కొత్త చిరునామా(ప్రస్తుత రాష్ట్రం, నియోజకవర్గం) , ఇమెయిల్ ,ఫోన్ నంబర్‌ మొదలైన సమాచారాన్ని నమోదు చేయాలి.

>> దీని తర్వాత మీరు ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ ID , చిరునామా రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

>> దీని తర్వాత క్యాప్చా నంబర్‌ను నమోదు చేసి, డిక్లరేషన్ ను ఒకే చేయండి. 

>> మీరు అందించిన సమాచారాన్ని మరోసారి తనిఖీ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

>> ఓటర్ ID కార్డ్ అప్‌డేట్ కోసం మీ దరఖాస్తు సమర్పించబడుతుంది.

>> ఓటర్ ID కార్డ్ అప్డేట్ తరువాత మీరు ఇమెయిల్ లేదా మొబైల్ మెసేజ్ వస్తుంది. 

>> ఈ అప్డేట్ తరువాత మీరు ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా గుర్తించబడతారు.

>> మీరు ఆ రాష్ట్రం లేదా జరిగే లోకల్ బాడీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటును వినియోగించుకోవచ్చు. 

ఓటరు గుర్తింపు కార్డును ఆఫ్‌లైన్లో ఎలా అప్‌డేట్ చేయాలి? 
 
>> ముందుగా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ నుంచి ఫామ్-8 డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా మీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి ఫామ్-8 తీసుకోండి. పైన ఆన్‌లైన్లో పేర్కొన్న విధంగా పూర్తి వివరాలను భర్తీ చేసి.. సంబంధిత అధికారికి దరఖాస్తును అందించండి. 

 అప్డేట్  కోసం అవసరమైన పత్రాలు

>> ఇప్పటికే ఉన్న ID కార్డ్ కాపీతో పాటు 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ప్రస్తుత చిరునామాకు సంబంధించిన ఆధారాలను ఖచ్చితంగా సమర్పించాలి.  అడ్రస్ ప్రూప్ కింద.. బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, రేషన్ కార్డు,పాస్ పోర్టు,   విద్యుత్  బిల్లు, నీరు  బిల్లు, టెలిఫోన్ బిల్లు, గ్యాస్  బిల్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ల్లో ఎదైనా ఒకదాన్ని సమర్పించాలి. 


గమనిక - మీరు ఇల్లు మారినా, జిల్లా మారినా, రాష్ట్రం మారినా.. తప్పకుండా మీ ఓటరు ఐడీలోని చిరునామా మార్చుకోవాలి

click me!